పుట:Kavijeevithamulu.pdf/499

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు
493
శ్రీ కృష్ణదేవరాయలు.

అని యున్నది. విశాఖపట్టణమండలములోఁ జేరిన సింహాచల క్షేత్రము సేవింపఁబోయి పొట్నూరుకడఁ బాతించిన స్తంభముమీఁదఁ జెక్కించిన శాసనముంబట్టి యితని భార్యలపేరులు చిన్నాదేవీ తిరుమలదేవులుగాఁ గాన్పించెడిని. అన్న పూర్ణనామము చిన్నాదేవియొక్క నామాంతరముగా నూహించుట నిర్వివాదాంశమగును. దీనింగూర్చి

కృష్ణరాయరాజ్యవిశేషములు.

"కొంగదేశరాజకాల్" లోను, విజయనగర రాజచరిత్రములోను, గొండవీటి దండకవిలెలోఁ గొంత వివరింపఁబడి యున్నది. కృష్ణరాయ, తత్పండితజన రచిత గ్రంథములలో సూత్రప్రాయముగ నావృత్తాంతములే వివరింపఁబడినవి. కావున ముందుగా పైగ్రంథములలో నేమి వ్రాయఁబడినదో చూపి అనంతరము పద్యకావ్యములవృత్తాంతము న్వివరించెదను. అందు " కొంగదేశరాజకాల్" అను గ్రంథములో "కృష్ణరాయఁడు పట్టాభిషేకము చేసుకొని తనతమ్ముఁడు అచ్యుతరాయఁడు, రంగరాయఁడు వీరలతోడను, తనమంత్రితోను రాజ్యముచేయుచు విజయనగరము కోట లెస్సగాఁ గట్టించి, పెనుగొండ, చంద్రగిరి మొదలగు కోటలు వెట్టించి, అనేకసేనల జేర్చి యితరదేశములం జయించుటకుఁ గోరి ద్రావిడదేశమునకుఁ బోయి అక్కడ కాంచి, సెంజి, వేలూరు మొదలగు గడీలను వశముచేసుకొని, వేలూరుకోట బహుభద్రపఱిచి దానిలో తనసేనలను రాజకుమారుల నుంచి రాజ్యపాలనము జేయు చుండెను. అపుడు కర్ణాటకరాజులలో నుమ్మత్తూరు శివసముద్రముల వారిని వశము చేసుకొనవలె నని యత్నించెను. ఉమ్మత్తూరు స్వాధీనమాయెను. అపుడు శివసముద్రముకోటలో రాజ్యముచేయుచున్న త్యావరా

శివసముద్రముపై దండెత్తుట.

జు కాలధర్మము నందఁగా నతనికుమారుఁ డగు గంగరాయఁడు శివసముద్రము కోటలో నుండి ఆయుధములతోను సేనలతోను గోడను భద్రపఱిచెను. ఇతని తండ్రియే ఫిరంగులు మొదలయిన వానిం జేర్చి యుంచె.