పుట:Kavijeevithamulu.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

491

నీ వుండుము. నేను బోయి శత్రువులం జయించి వచ్చెద నని పలికెను. అపుడు కృష్ణరాయలు లేచి అంజలిబంధముం జేసి యిట్లనియె. నే నుండఁగ మీరు దండయాత్రకుఁ బోనేల ? యోఁచించవలయును. నేను పోయి శత్రులం జయించి కప్పములం గట్టించుకొని వచ్చెదను. అన వీరనృసింహదేవరాయలు కృష్ణరాయనితో నిట్లనియె. నీవు చిన్నవాఁడవు. పదియాఱు సంవత్సరములే నీకైనవి. ఇట్టి నీవు యుద్ధములకుం బోఁగూడదు. నీవు కోటం గనిపెట్టియుంట మంచి దని చెప్పగాఁ గృష్ణరాయం డందులకు సమ్మతింపక తానే యుద్ధయాత్రకై తరలెను." అనియున్నది. ఇది పైకథతోఁ గొంత భేదించును. అయినను విరుద్ధము కాదు.

వీరనరసింహరాయనికి రాజాధిరాజ రాజపరమేశ్వర ప్రౌఢప్రతాప మహారాయ లనుబిరుదు లున్నట్లుగాఁ గొంగదేశరాజకాల్ చెప్పును. ఇతని రాజ్యవిశేషములు మనుచరిత్రాదులలో నసాధారణములుగా వర్ణించఁబడినవి. ఎట్లన్నను :-

"క. వీరనృసింహుఁడు నిజభుజ, దారుణకరవాలపరుషధారాహతవీ
     రారి యగుచు నేకాతప, వారణముగ నేలెధర నవారణమహిమన్."

       ఇఁక పారిజాతాపహరణములో.

"క. వారలలోఁ దిప్పాంబకు, మారుఁడు పరిపంథికంధి మంథాచల మై
     వీరనరసింహరాయఁడు, వారాశిపరీతభూమివలయం బేలెన్."

ఈరెండు పద్యములలో వీరనరసింహ రాయని విక్రమము మాత్రమే చెప్పఁబడెంగావున నతఁ డట్టివాఁడని చెప్పవచ్చునుకాని ఇతని నాఁడు వీరిరాజ్యమునకు విశేషదేశములు కలియ లే దని మాత్రము చెప్పవలసియున్నది.

కృష్ణరాయనివృత్తాంతము.

దీనింగూర్చి కొం. రా. లో నిట్లున్నది. "ఇతఁడు విజయనగరములో నవరత్న సింహావనాధిరోహణము శా. స. 1426 అగు నేఁటి రక్తాక్షి సంవత్సర చైత్రమాసములోఁ బట్టాభిషేకము అయినపిమ్మట