పుట:Kavijeevithamulu.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

490

కవి జీవితములు.

ఇట్లుచేరి తనతమ్ముఁ డగుకృష్ణరాయని విశేష సేనలను ధనమును తీసుకొని ఉమ్మత్తూరు శ్రీరంగపట్టణముల జయించుటకై పంపెను. మఱికొన్నిదినములకు అనఁగా శా. స. 1425 అగు రుధిరోద్గారి సంవత్సరములో మరణమునొందెను." అనియున్నది. అయితే క్రీ. శ. 1487 మొదలు 1507 వఱకు నీవీరనరసింగరాయల శాసనములు కానుపించుటం జేసి యితఁ డంతవఱకు ననఁగా 20 సంవత్సఱములు రాజ్యముచేసినట్లు చెప్పవలసియున్నది. అది శా. స. 1430 సంవత్సరము కావలసియున్నది. కాని 1425 కాదు. ఇఁక విజయనగరమునుగుఱించినకథ యనుగ్రంథములో వీరనరసింగరాయల అధికారముంగూర్చి యీక్రిందివిధంబునం జెప్పంబడియున్నది. అందు :-

"ఆనరసింహ దేవరాయనికి పెద్దకుమారుఁ డైనవీరనృసింహదేవరాయల కతఁడు పట్టాభిషేకముంజేసి కృష్ణరాయలం బిలిచి వీరనృసింహదేవరాయని చేతికి నొప్పగించి ఈకృష్ణరాయని కూడ నుంచుకొని నీవు సకల కార్యములు నడిపింపుము. అట్లైన నీకుకీర్తి ప్రతిష్ఠలు రాఁగలవు. అనిచెప్పఁగా నరసింహ దేవరాయలును కొన్నిదినములు కృష్ణరాయని దగ్గఱ నుంచుకొని రాజ్యవ్యవహారము చేయుచువచ్చెను. ఇట్లుండఁగా వీరనృసింహరాయఁడు బాలుఁడౌటచేతను, వ్యవహార దక్షత తక్కువయై యుండుటచేతనుఁ ఇతనితండ్రి రాజ్యకాలములో పన్ని చ్చుచువచ్చినరాజూ లీతనికి పన్ని చ్చుట మానివేసిరి.

ఇట్లుండ వీరనరసింహరాయఁడు తనతమ్ముఁ డగుకృష్ణరాయని బిలిచి యిట్లనియె. మనదేశమునందుండు రాజు లిదివఱకు భృత్యులై యుండి కప్పములం గట్టుచుండిరి. ఇపుడు మనము పిన్నల మవుటచేత లక్ష్యము చేయక వీరనరసింగరాయఁడు శూరుఁడని భయమున పన్నిచ్చినారము గాని యీపిల్ల వాండ్రకుంగూడ పన్ని చ్చెదమా అని చెప్పి శఠించినారు. కావున సర్నసేనావృతులమై మనలో నొక్కఁడు శత్రువులంజయించుటకు వారిదేశములకుం బోవలయును. కావున నీరాజధానిని గనిపెట్టికొని