పుట:Kavijeevithamulu.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

488

కవి జీవితములు.

గాని పైకొంగదేశపురాజకాలులోఁ జెప్పినవిధమునఁ గాదు. కావున నరసింహరాయనికి నిర్వురు భార్య లనియు, నా యిర్వురివలన నిర్వురు కుమారులు గల్గి రని సిద్ధాంతము చేసెదను. అయితే పైన చెప్పంబడిన యోబాంబికకుఁ గల్గి రనిన రంగరాయ అచ్యుతరాయు లెవ్వరికుమారు లనుదాని నాలోచించవలసియున్నది. దానికి గ్రంథ దృష్టాంతము లగుపడువఱకు సరియైన సమాధానము రానేరదు, నరసింగరాయనామము గలకుమారుఁడు పైనరసింగరాయనికే యున్నాఁడు. అతఁడు వీరనరసింగరాయఁ డని పైగ్రంథత్రయమందును గానుపించుచున్నది. కావున నీయిర్వురు పుత్త్రు లావీరనరసింగరాయని కుమారులుగా భావించెదను. [1]

ఇఁక నరసింగరాయనిమృతి యెప్పుడో వ్రాయవలసియున్నది. అందువిషయమై కొ. రా. లులో శా. శ. 1401 అగుశార్వరి (A. D. 1478) గా వివరింపఁబడినది. విజయనగర రాజుల శాసనములలో క్రీ. శ. 1471 లో నొకశాసనమును, 1487 లో నొకశాసనమును నరసింగరాయని శాసనములు కానుపించుచున్నవి. ప్రిన్‌సెపుదొరశాసనములలో క్రీ. శ. 1490 లో వీరనరసింహరాయనిశాసనము కానుపించును. 1490 సంవత్సరములోఁ గాన్పించిన శాసనము వీరనరసింహరాయని దవుటచేత నాతనితండ్రి 1487 వఱకు నున్నట్లును, వీరనరసింహరాయఁడు తదనంతరము రాజ్యమునకు వచ్చె ననియు నూహింపనై యున్నది. క్రీ. శ. 1487 - 77 = శా. స. 1410 అగును.

వీరనరసింగరాయఁడు.

ఇతనిం గూర్చియు కొంగదేశరాజకాల్ కొంతచరిత్రము చెప్పుచున్నది. అది యెట్లనఁగా :- "శార్వరిసంవత్సరములో నితనికిఁ బట్టాభిషేక మాయెను. ఇతఁడు తండ్రివలెననేకదేశములలోఁగప్పము గొనియెను. ద్రావిడ పాండ్యచోళ దేశములవారు కొంతద్రవ్యమిచ్చి ఇతని

  1. చింత్యము