పుట:Kavijeevithamulu.pdf/472

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
466
కవి జీవితములు.

శా. జ్ఞానప్రౌఢమహాజనాధికవచస్సంస్తూయమానుండు ల
     క్ష్మీనాథుండు మదల్పవాక్య రచనాస్వీకర్త కాకుండునే
     నానాభూపతుల్లెఁ గానుకలు రత్న శ్రేణు లర్చించగాఁ
     ధానాముష్టిముచుం గుచేలుఁ గరుణన్ ధన్యాత్ముఁ గాఁ జేయఁడే."

అని సకలలోక నాయకుం డైన శ్రీరంగనాయకుండు కృతినాయకుండు గా నిశ్చయుంచి

అని యున్నది, పైపద్యసందర్భముతో దీనిని బరిశీలించి చూడఁ గా నీకవి మొదట నీగ్రంథము నరకృతి చేయ యత్నించి యుండె ననియు నది యేకారణముననో మాఱి దైవకృతి కంగీకరించె నని చెప్పెడు లోకప్రతీతి సరియైనదిగానే కానుపించుచున్నది.

గ్రంథరచనాప్రకారము.

ఈ నృసింహకవి తా నేశాఖాబ్రాహ్మణుఁడైనదిగానీ లేక బ్రాహ్మణుఁడైనదిగానీ చెప్పియుండలేదు. అట్లుండుటంబట్టి నృసింహకవి యేవర్ణస్థుఁ డైనదియును జెప్ప వీలుపడదు. ఇతఁడు బ్రాహ్మణుఁ డనియు నియోగి యనియు లోకములో నున్న వాడుకనే నమ్మవలసినది గా వచ్చుటంజేసి అటు లై యుండిన నేమతస్థుఁ డనుదానిం దెల్పుటకు గా నాతనివలఁ గృత్యాదిని చేయంబడిన యిష్టదేవతాస్తోత్రపాఠములను బట్టి నిర్ణయించెదను. అందులో మొదట విష్ణుని, పిమ్మట బ్రహ్మను, శంకరుని, వినాయకుని, సరస్వతిం బ్రార్థించె. ఇది స్మార్తులుగానుండుబ్రహ్మక్షత్రియులు చేయుస్తోత్ర ప్రక్రియ యై యున్నది. కాని భట్టు పరాశర శిష్యుండ నై చెప్పుటంజేసి యితఁడు నల్లసాని పెద్దనవలె స్మార్తుఁ డయ్యును వైష్ణవేష్టి చేసికొని రామానుజసిద్ధాంతప్రధానుఁ డై యుండిననియోగి యని యూహింప నై యున్నది.

సుకవిస్తుతి, కుకవినిరాకరణము.

ఈకవి యేకారణముననో ప్రాచీనకవుల నేరిం బ్రశంసించి యుండఁడాయెను, ఆస్థలములలోఁ గొన్ని సుకవి లక్షణములును, కుకవి లక్షణములం జెప్పి ఆనడుమ సత్కావ్యముల యొక్కయు దుష్కా