పుట:Kavijeevithamulu.pdf/452

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
446
కవి జీవితములు.

షోపయోగకారులు కాఁగోరుచున్నాము. ఈయనప్రబంధములు కొన్ని రచియించె నని వాడుక గలదు. వానిలోఁ బయలు వెడలినది యొక్క సర్వకామదాపరిణయమే. అది పూర్వపక్షకోటిలోఁ బడిపోవుటచేతఁ దక్కినగ్రంథములు వ్యాపకములోనికి రాలే దని తోఁచెడిని. సర్వకామదాపరిణయముకూడఁ జిరకాలము పేరైన వినఁబడకయుండెను. ఈసంవత్సరమే మామిత్త్రునివలన యత్నించఁబడి అతని కతికష్టముపైని సర్వకామదా పరిణయ గ్రంథముమట్టుకు దొరికిన దనియు నింకను కృ. కవి గ్రంథములంగూర్చి యత్నించుచుండె ననియు విని అత్యానందము నందినాఁడను. ఈ కృ. కవి కాళహస్తిసంస్థానములో నుండఁగ వేంకటేశ్వర మాహాత్మ్యము నాంధ్రీకరించెను. అది కొంతకాలముక్రిందట ముద్రితమై ప్రకటింపఁబడినది. అదియొక్కటియే ప్రస్తుతములో గృ. కవిప్రణీతగ్రంథ మని చెప్పవలసియున్నది. అది ప్రబంధశైలిని లేక సామాన్యశైలి నుండును గావున నందలి విశేషములఁ గూర్చి వివరింప మానెదను.

కాకర్లపూఁడివారిపై కృ. కవి చెప్పినయుత్పలమాలికలు.

"ఉ. వీరు తెనుంగుసాము లరబీతరబీయతు నొప్పుగొప్పస
      ర్కారువలే జమీలు దరఖాస్తుగ నేలినరాజమాన్యహం
      వీరులు ఢక్క ణేలు తజివీజుకులాహికు లున్న మేటిమం
      జూరు జొహారు యాఖిదుమషూరు ఖరారు మదారు బారు బ
      ర్దారు మిఠా ర్గురాలపరదారులుఠౌరు కడానితేరులం
      బారుమిఠారునౌబతు సుమారు పుకారును మీరుకుడ్తినీ
      దారుగుడారుపైకము బిడారుబజారుకొటారులందు నే
      దారుపఠాణిబారుదళదారుసవారు షికారులందు బి
      ల్కూరుసతాసవారు పిలగోలతుపాకులఫైరులందు లే
      ఖ్యారుగఁ బెక్కుమారులు తయారుగ వీరిహజారులందు వె
      య్యాఱులు పెద్దపేరుల జొహారులు చూచి హమీరు లెంచి ద
      ర్బారుపసందుమీఱ వహవా యని మెచ్చునవాబుఖానుషేం
      షేరు బహాదరుల్ పెరవజీరుల మాఱులమాఱుకెన్న తా
      ర్మాఱుగ మోఁది గీములు త మాము వదల్చి మఖాములెల్ల ఫీ
      ర్ఫారొనరించి మిక్కిలి మరాతబులందిరి చేరుమాలు త