పుట:Kavijeevithamulu.pdf/449

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
443
శిష్టు కృష్ణమూర్తి కవి.

ఈకవికాఁపురస్థలము గోదావరీమండలములోని రామచంద్రపురము తాలూకాలోఁ జేరినగొల్లపాలెముగ్రామము పిత్రార్జితస్థల మనియు నీతఁడు బాల్యమునం దచ్చటనే యుండి విద్యాభ్యాసము చేసి తదనంతరము రామచంద్రపురము వచ్చి కొన్నిదినము లుండెననియు వాడుకొనంబడు. ఈకవి ఆంధ్రదేశములో నుండుసర్వభాగములం జూచి అచ్చటచ్చటఁ గొన్నికొన్నిసంవత్సరములు నివసించియుండెను. రామచంద్రపురమునుండి విశాఖపట్టణము మండలములోని కొన్నిగ్రామములలోఁ గొన్ని సంవత్సరము లితఁడు నివసించెను. అనంతపురము చిత్తూరుజిల్లాలోని కాళహస్తిలోఁ గొన్నిసంవత్సరములు నివసించెను. పిమ్మట గోదావరీ మండలములోని పెద్దాపురము తాలూకాలో జగ్గంపేటగ్రామములో తుదిని మాడుగులు గ్రామములో స్థిరపడెను. పైగ్రామములలో నుండెడు జమీన్ దారు లీకవిశిఖామణిని ఆదరించి యుండఁగోరినమీఁదట నీతఁ డాయాస్థలములలో నివసించినట్లుగాఁ గానిపించును. కృ. కవిని మాడుగులు కృష్ణభూపతి విశేషమాన్యక్షేత్రము లిచ్చి నిల్పఁగా నా గ్రామములోనే నిర్యాణము నందెను.

కృ. కవి లాలీనులు.

కొంచె మెచ్చుతగ్గుగాఁ గ్రీస్తుశకము పందొమ్మిదవశతాబ్దము యొక్క మొదటిమూఁడుఖండములలోనిపండితులును, కవులును కృ. కవి కాలీనులనియే చెప్పవలసియున్నది. అందులోఁ గృష్ణమూర్తికవి యుత్తరార్ధవయఃకాలములోఁ బరవస్తు చిన్నయసూరియును, ఓగిరాలవారిలో ద్విరేఫవర్ణ దర్పణకారుఁ డగురంగనాథకవియును, నతని పితృవ్య పుత్రుఁడును సుమనోమనోభిరంజనప్రబంధకర్త యగు నోగిరాల జగన్నాథకవియును, పై యిర్వురికిని గురుం డగు మంత్రిప్రగడ. వేంకటరామన మంత్రియును కాలీను లని చెప్పవలసియున్నది. ఆనాఁటికిఁ గృ. కవియును వేంకటరామన మంత్రియును సంగీత సాహిత్యవిద్యాప్రవీణు లగు గురువులుగా నుండిరి. రంగ నాథకవి మొదలగువారు తమగురుఁ డధికుఁడని