పుట:Kavijeevithamulu.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

438

కవి జీవితములు.

తీర్పునకుఁ గారణ మేమి యై యుండు నని విచారించి అది ధనకారణ మౌట యెఱింగి లక్ష్మణకవి పండితునిపైఁ గొన్ని పద్యంబులు, చెప్పి వ్యాపింపఁజేసెను. అవి యెట్లన్నను :-

సీ. మహనీయ శంకర మంచిగోత్రమునఁ బ్ర, పాతకుం డన థరిత్రీతలమున
    బండితుండువలెఁ గన్పడును స్థాణుత్వ మే, ర్పడ నొక సాధులపలుకు వినవు
    పుక్కిట విషమె యెప్పుడు నీకు నుండును, మది వీడ వెపుడుఁ దామసగుణంబు
    భీముఁ డుగ్రుడు ననుపేరుఁ గాంచి నశింతు, వంబికాపతివి బ్రహ్మఘ్నుఁడవు న

గీ. నంతనాముండ వరయంగ నష్టమూర్తి, వగుచుఁబితృవనమందు భస్మాంగుఁడవయి
   భూతములును బిశాచాముల్ బ్రోదిఁగూడు, కొనఁగనుండుదువండ్రునిన్ జనము లెల్ల.

మ. సరవిన్ శంకరమంచిపండితుఁ డనన్ జానొప్పువాఁ డర్థసౌ
     ఖ్యరుచిన్ జెందియుఁ జింతలూరి యలమంగామాత్యసాధ్యాత్మమం
     దిరసుక్షేత్రములన్ హరించి కపటాన్వీతుండు నౌవాదిక
     ల్లరి గాఁ డంచునుఁ దీర్పు చేసి జనముల్ నవ్వం బడున్ దుర్గతిన్.

ఉ. దక్షిణదిక్కు నుండియ యుదంతముఁ దెచ్చినధర్మరాజు ప్ర
    త్యక్ష మనంత పాతకున కిచ్చెడు మార్గము వోవునట్లు గా
    దీక్షవహింపవే ధవళ ధేహుఁడ శంకరమంచి కూళ్లపై
    పక్ష మదేల దుష్టజనభంజన సజ్జనభావరంజనా.

సీ. పరశురాముఁడు తండ్రిపంపున రేణుకన్, దనతల్లియనకను నఱికివైచె
    జనకజాపతి తండ్రిపనుపున రాజ్యంబు, వాసి మహారణ్యవాసి యయ్యెఁ
    గుండినముని జనకునియాజ్ఞచే సంశ, యింపక గోవుల హింసచేసె
    భీష్ముఁడు తండ్రి యభీష్టంబు దీర్ప రా,జ్య శ్రీసుఖాదికార్యములు విడిచె

గీ. తండ్రిపంపునఁ దనకన్నతండ్రిపేరు, చెప్పుకతన నదత్తుఁడే చింతలూరి
    మంగరా జిట్లు శంకరమంచిపండి, తుండు దీర్చుట జీవన్మృతుండు గాఁడె

సీ. వసుదేవసుతుఁ డన్న వాక్యంబుననె పద్మ, నాభుండు నందనందనుఁడు గాఁడె
    మాద్రీతనయుఁ డన్న మాత్రంబుననె కవల్. కౌంతేయు లన్నవిఖ్యాతిఁ గనరె
    పార్వతీసుతుఁ డని పల్కినంతనె కుమా, రుఁడును దాఁగార్తి కేయుండు గాఁడె
    బాపిరాట్సుతుఁ డన్న భాషనె మంగన్న, ధృతి జగ్గరాడ్దత్తసుతుఁడుగాఁడె

గీ. వేదశాస్త్రపురాణము ల్వినియుఁగనియు, నెఱిఁగి యెఱుఁగనివాఁడునై యిట్లువిత్త
    వాంఛ నన్యాయముగఁ దీర్చుపండితుండు, ఘోరనరకంబులందులఁ గూలకున్నె.

ఇ ట్లనేకపద్యంబులు చెప్పి పండితుని యన్యాయంబు జగంబున శాశ్వతముగా నుండునట్లు లక్ష్మణకవి కావించెను. లక్ష్మణకవి చెప్పినట్టి