పుట:Kavijeevithamulu.pdf/442

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

436

కవి జీవితములు.

వికిఁ గవిత్వమేగాని శాస్త్రము లేమి తెలియు నని యాక్షేపించెనఁట. ఆవార్త విని ల. కవి యీక్రిందిపద్యము వ్రాసి పంపె. ఎట్లన్నను :-

"గీ. ఉక్కు చెద దిన్న దశదిక్కు లొక్కటైన
     చుక్క లిలఁ బడ్డఁ గులగిరు ల్వ్రక్కలైన
     మొక్కపాటింట నోటను ముక్కలేదు
     పేరిశాస్త్రికిఁ గలిగెరా పెదవిపాటు."

ఇట్టి లక్ష్మణకవి చెప్పిపంపినపద్యము విని ఆగ్రహంబున పేరిశాస్త్రి యిట్టి పద్యములు చెప్పిన పైజాఱులఁ గొట్టించెద నని వర్తమానంబు పంపె ననియును దానికి సమాధానముగ ల. కవి లోజారుల ముందు గొట్టించి పిమ్మట పైజాఱుల సంగతి యోచింపు మని వర్తమానంబు పంచెనఁట.

ఇటులనే కూరపాటి, వేంకటశాస్త్రి యనునతఁ డొకపరి ల. కవితో విరోధించిన లక్ష్మణకవి యీక్రిందిపద్యంబు వ్రాసినంపెను.

"గీ. కూరపాటి వెంక కుక్కలు దినుకంక, లేనిపోనిశంక మాను మింక
     ముఖము చూడఁ గుంకముండవనెడుశంక, నాకుఁదోచెఁ జంక నాఁకు మింక."

ల. రావునీలాద్రి రాయని నధిక్షేపించుట.

ఈలక్ష్మణకవి యొకపరి పిఠాపురాధిపుఁ డగురావునీలాద్రిరాయని దర్శింపఁబోయెను. అపు డచట జంగము బసవయ్య యను నొక రాజవైద్యుని మూలమున బ్రాహ్మణుల గౌరవము నిషేధింపఁబడుట తెలిసికొని లక్ష్మణకవి వ్యాజస్తుతిగా రాయని నీక్రిందివిధమున నుతియింప నారంభించెనఁట. ఎట్లన్నను :-

"రావువారిసంస్థానములోనే మర్యాదలు. రావువారిసంస్థానములోనే బహుమానములు. రావువారిసంస్థానములోనే పరువులు." అని ప్రారంభింప నం దేదియో అపహాస్య మున్న దని నీలాద్రిరావు లక్ష్మణకవిని నగౌరవంబుగా బహుమానించి పంచె నఁట.

పెండ్లిండ్లకుఁ బోవుట.

లక్ష్మణకవి చుట్టుపట్ల నుండుగ్రామములలో మహాజనుల యిండ్ల