పుట:Kavijeevithamulu.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

435

పఁదగినగ్రంథము భగవద్గీతలుగా నెంచి ఆగ్రంథము నాంధ్రీకరింప బ్రారంభించెనఁట. అట్టి వర్తమానంబు వృద్ధగౌతమి కవ్వలియొడ్డున నివసించి యున్న బులుసు, అచ్చయ్య శాస్త్రి అనుపండితుఁడు (బులుసు. పాపయ్య శాస్త్రికిఁ దండ్రి) విని వేదాంతరహస్యములు గలగీతలు తెలుగుగాఁ జేయంబడుచుండెనే. దీనిమూలముగ వేదాంత శాస్త్రము వెల్లడియగునే అని చింతించి దానిని మాన్పింప నెట్లుగా నగు నని మనంబున నూహించుచుండి యొకనాఁటిమధ్యాహ్న సమయమునకు ల. కవి యొక్కగ్రామ మగుకుయ్యేరుం జేరెను. అట్లు చేరి ల. కవి యింటికింబోయి అతనితో తడవు మాటలాడుచునుండెన. అపుడు ల. కవి ప్రొద్దుపోయినది కావున మాధ్యాహ్నిక కృత్యము తన యింటనే జరిగింపుఁ డని అచ్చయ్య శాస్త్రిగారిని బ్రార్థించెను. ఆయన మొదట తనయూరునకుం బోవలయు నని చెప్పి తుద కక్కడనే యుండుట కంగీకరించెను. అటు పిమ్మట నిర్వురును స్నానాదికృత్యములం జరుపుకొని భోజనార్థము పరిషే,చనము చేసి మాస్తోదకముం గైకొనుచో నచ్చయ్య శాస్త్రి హస్తోదకముం గైకొనక యూరక చూచుచుండెను. ల. కవి ఆలస్యము లేదు హస్తోదకముం గైకొనుఁ డని వేగిరించినను, ఆశాస్త్రి అటుల చూచుచు నూరకొన, ల. కవి ఆయన కెద్దియో కోర్కె కలదని యూహించి మీయభిప్రాయ మెద్దియో దానిం జేయ సిద్ధముగా నున్నాను. హస్తోదకముం గైకొని భోజనము చేసి చెప్పవలసినది చెప్పవచ్చునా యని యడుగ ఆశాస్త్రి అటులైన మంచిది యని హస్తోదకముం గైకొని భోజనము ముగించెను. పిమ్మట ల. కవి ఆ. శాస్త్రిమనోగతాభిప్రాయ మరసి అదివఱలోఁ దానాంధ్రీ కరించుచున్న భగవద్గీత సంచికలను శాస్త్రిగారిపరముగా నిచ్చి యింతటనుండి యీలాటిగ్రంథంబులఁ దెనిఁగించ నని చెప్పి అ. శాస్త్రి నింటికిఁ బంచెనఁట.

లక్ష్మణకవి తనకాలీనులపైఁ జెప్పినకొన్ని పద్యములు.

మొక్కపాటిపేరిశాస్త్రి యనుపండితునకు నీలక్ష్మణకవికి నొకప్పుడు విద్యావివాదము తటస్థించెను. అందులోఁ బైశాస్త్రి లక్ష్మణక