పుట:Kavijeevithamulu.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

434

కవి జీవితములు.

దేఱి అతని హజారమున ప్రభునికై వేసి యున్న యున్న తాసనమందుఁ గూర్చుండెను. దానికిఁ గోపించి వేంకటరాయ మంత్రి గొం తెత్తి అతి నాసీ నీ దనియే కూర్చుంటివా? అని యడిగెను. దానికి లక్ష్మణకవి సమానకంఠధ్వనితో నిది నీతివాసేనా? నీతివాసేనా? నీతివాసేనా? అని ముమ్మాఱు కేకవేసి సమాధానము చెప్పెను. దానిని విని యితఁడు లక్ష్మణకవి యని భావించలేక వేంకట్రాయమంత్రి యితఁ డెవ్వఁడో అధిక ప్రసంగిలాగున నున్నాఁడు. తగినట్లుగా జరిపి పంపినంగాని బాగు లే దని నిశ్చయించుకొని మీవారిలో నీవే అధికుఁడవులాగున నున్నావే అని యడిగెను. అపుడు ల. కవి. జంకక యొకటిరెండు వర్ణము లెచ్చు తగ్గుకాఁగా నందఱు సమానులే అగుదు రనియెను. ఆమాట బోధకు రాక వర్ణభేదము చెప్పితివేమిటి దానిని స్పష్టీకరింపు మని వేం. మంత్రి యడుగఁగా ల. కవి యిట్లనియెను. ర్యాలివారికి వర్ణములు రెండు. పిండిప్రోలివారికి వర్ణములు నాల్గు. కొచ్చెర్లకోటవారికి వర్ణము లైదు. ఇందు మొదటివారు ద్వివర్ణులు. రెండవవారు చతుర్వర్ణులు. మీరు పంచ వర్ణులు అనిపల్కిన, ల. కవింజూచి వేం. మంత్రి ఇతఁడేమి యోగివలె నర్థము లేనిమాటలు పల్కుచున్నాఁడు. ఎవఁడీతఁడు అనుడు ల. కవి ఇట్లనియె. ఇపుడు మాటలాడునతఁడు యోగికంటె పైవాఁ డగునియోగి పిండిప్రోలు లక్ష్మణుఁ డనువాఁడు. అనుపల్కులు విని వేం. మంత్రి తా నావఱకుఁ జేసినప్రసంగమున ల. కవి మనస్సు నొచ్చెనేమో యని శంకించి తా నతనింబోల్చలేకపోతిననియును తనతొందరపాటును క్షమించవలయి ననియును బ్రార్థించె. అపుడు ల. కవి తా నట్టితొందరపాటు గలప్రభులను శాంతింపఁ జేయవచ్చితినిగావున సెలవు గైకొనియెద ననుడు. వేం. మంత్రి యతనిం గూర్చుండఁబెట్టి యథావిధి నబహుమానంబుగా గారవించి పనిచె నఁట.

భగవద్గీతలఁ దెనిఁగింప మానుట.

ఈ ల. కవి ప్రస్థానత్రయముం జదువుకొని వానిలో నాంధ్రీకరిం