పుట:Kavijeevithamulu.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
32
కవి జీవితములు

14. మాళవరాజమస్తకశూలంబు - దీనివలన మాళవరాజును దన వశవరిగఁ జేసికొనియె నని తేలుచున్నది. ఈవంశస్థులలోనిరాచిరాజు అనునతఁడు మాళవరాజును జయించి అతనిమన్యసుల్తాన్‌బిరుదు లాగు కొనియెను.

15. కర్ణాటరాజకందకుద్దాలకుఁడు - దీనికి కర్ణాటసంస్థాన కందకుద్దాళికుఁ డని పాఠాంతరము. కర్ణాటరాజులను మొదలుతోఁ బెల్లగించి యారాజ్య మాక్రమించుకొనె నని భావము.

16. వైరిరాజోరగవైనతేయుఁడు.

17. శౌచగాంగేయుఁడు.

18. వీరసేతు ప్రతాపభాసురుఁడు - చారిత్రోపయోగములు కావు.

19. వామఛురీధరుఁడు - దీనివలన నిప్పటివఱకు నీవంశమువారి వలన కత్తి యెడమభాగమందు ధరియింపఁబడు ననుసాంప్రదాయము తేలుచున్నది.

20. నెల్లూరు, యెలమంచిలి, కంచి, దేవగిరిచూరకారుఁడు - ఈనాల్గిటిరాజ్యరమాచూర కారుఁ డని పాఠాంతరము. దీనిలోఁ జెప్పఁబడిన నాలుగుపట్టణములు నాలుగు రాజధానులు. అందు నెల్లూరు మనుమసిద్ధి రాజుది. ఎలమంచిలి కళింగాధిపునిది. కంచి చోళప్రభునిది. దేవగిరి యాదవవంశ ప్రభువులది. దీనిని తురష్కులు తమస్వాధీనము చేసికొనినతరువాత దౌలతాబా దనునామాంతరముచే వ్యవహరించుచుండిరి. ఈబిరుదు సంపాదించునాఁటికి ఈనాల్గు రాష్ట్రములం జేర్చికొనినట్లు కాన్పించును.

21. ఆంధ్రకటకవజ్రప్రాకారుఁడు - ఆంధ్రదేశ కటకమునకు వప్ర ప్రాకారముగాఁ గలవాఁడు.

22. మానగోవిందనామధేయుఁడు.

23. కుంతకౌంతేయుఁడు. - చారిత్రోపయోగములు కావు.

24. విజయవాటికా సింహాసననాధ్యక్ష మాధవ వర్మాన్వయ లలాముఁడు - విజయవాటి అనియు లేక బెజవాడ అనియు బిజయపుర