పుట:Kavijeevithamulu.pdf/438

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
432
కవి జీవితములు.

కగొప్పయాకక్షేపణయగును. సీమంతము చేసెడివాఁడు ధర్మశాస్త్రముం బట్టిచూడ భర్త యగును. రాజస్త్రీలకు నిత్యమును సీమంతముం జేయువారలు చెలికత్తెలుగాని బ్రహ్మదేవుఁడుగాఁడు. ఇతఁడు పాపట దిద్దె నని చెప్పుట యాక్షేపణార్హము. ఇది మనుష్యరచితముగాన బ్రహ్మ రచించె నని చెప్పుట అలంకారజ్ఞానహీనతం దెల్పును.

(6) బ్రహ్మ సూర్య చంద్రుల గమనమునకు వేర్వేఱు సీమ లేర్పరిచె నని చెప్పుటయు నసందర్భమే. లోకములో సూర్యుఁడు సంచరించు మార్గముననే చంద్రుఁడును బోవుచుండుట యనుభవసిద్ధమే. సూర్యుఁడు కొన్ని దేశములలోను జంద్రుఁడు గొన్ని దేశములలోను నగపడుటకు శాస్త్రసహాయము లేదు. పై యిర్వురకును గాలభేదము చెప్పిన నొప్పునుగాని సీమాభేదము చెప్ప నొప్పియుండదు.

(7) మఱియును వదనము పద్మ మని సూర్యుఁడును, నేత్రము లుత్పలము లని చంద్రుండును వచ్చి యుండె నని చెప్పుటంజేసి సూర్య ప్రచారము కల్గిన ముఖభాగము వికసించి యుండవలయు ననియును, చంద్రప్రచారము కల్గిన ముఖభాగము ముడుచుకొని యుండవలయుననియు, నటులనే చంద్రప్రచారము కల్గిననేత్రోత్పలము వికసించియుండు ననియును సూర్యప్రచారము కల్గిననేత్రోత్పలము ముడుచుకొని యుండవలయు ననిచెప్పి యిట్టి కాంతముఖ మమానుష్యముగా నుండకుండు నా యని పల్కెను. పైయాక్షేపణలలో నాల్గవ యాక్షేపణచేసిన వెంటనే అచ్చో సంచరించెడు రాజదాసీలలో నొకదానిం బిలచి పిల్లదానా సూర్యుఁడు చంద్రుఁడు అనునగలు కంటికొలుకుల నుంచుకొనియెదరా లేక నొసట నుంచుకొనియెదరా ? అని లక్ష్మణకవి ప్రశ్న సేయ నది అయ్యో తలమీఁద నమర్చుకొను నగలు కంటిమీఁదను ముఖముమీఁదను బెట్టుకొందురా? అని యడిగెద వేమి బాగు బాగు అని యుత్తర మిచ్చెను. అప్పుడు లక్ష్మణకవి మేము బీదబ్రాహ్మణుల మగుటంజేసి వస్తువులమొగమైన నెఱుఁగము. ఎక్కడ యేవస్తువు నుంచుకోవలయునో తెలి