పుట:Kavijeevithamulu.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

431

గారణ ముండదే. ఇదివఱలో నట్టిశరీరరాంఛనములు లేకున్న మహాకవి ప్రణీత కృతిలో నున్నవర్ణ నానుసారము జరుగునేమో. ఇట్టి కవిత్వప్రజ్ఞ యుండెను గనుకనే కృ. కవి. తనగ్రంథము నొరులు పరీక్షించఁగూడ దని నిశ్చయించుకొనియుండెను. అట్టివారియుద్దేశమును జెడఁగొట్టి ఆగ్రంథము నను బరిశీలించుటకుఁ గోరియున్నారు. గ్రంథమంతయుఁ బరిశీలించుట మిక్కిలి శ్రమకర మైనపని కాకపోదు. ప్రస్తుతపద్యమును బరిశీలించి తక్కినగ్రంథపరిశీలనా విషయముం బిమ్మట జెప్పెదను. అదెట్లన్నను :-

(1) "తరణిశశాంకు" లనుపేరు లాభరణపర మైనయపు డుండఁగూడదు. ఆభరణము లర్థము లగునపుడు సూర్య, చంద్రు లనుపేరులు రూఢములు.

(2) వదవాక్షు లనుచో నివి రెండు నేకదేశములు. కావున మొదటిది చెప్పినమాత్రముననే రెండును జెప్పిన ట్లగును.

(3) ముద్దియ కుంతలదేశ మాక్రమించి రనుచోఁ గుంతలదేశ మొకప్రసిద్ధిమైనది కాదనియును ద్రిలోకముల నాక్రమించు సూర్య చంద్రు లొకకుంతలదేశమును మాత్రమే ఆక్రమించి రని చేసినవర్ణనలో నదివఱకున్న గౌరవము దీసివేయఁబడిన దనియును, ఇంతియకాక యొక్క కుంతలదేశమునందే యీసూర్య చంద్రు లనుభూష లుండె నని చెప్పుట స్వభావవిరుద్ధ మనియుఁ జెప్పె.

(4) వదనాగ్రము నేత్రాగ్రము ననుచో వదనమున కగ్రము నిర్ణయించఁ బడవలయుననియు, నేత్రముయొక్క అగ్రము కనుకొలుకు లగుననియు నక్కడ సూర్యచంద్రులను నాభరణము లుంచిన నానా యిక నగ లుంచుకొనుతావులనైన నెఱుఁగనిస్త్రీ యగునుగనుక నట్లనుట ప్రస్తుతము చెప్పుచున్న రాజుభార్యయెడలఁ జెప్పఁగూడ దు.

(5) సాంతముగ బ్రహ్మా యొనర్చిన సీమ పోల్పగున్ అనుచో నిక్కడ సీమాంతమును బ్రహ్మ చేసె నని చెప్పంబఫియుండె. ఇది యొ