పుట:Kavijeevithamulu.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

430

కవి జీవితములు.

ల. కవి. ఇక్కడ నట్టి ప్రస్తావన వచ్చినది గనుకనే అడుగుట యైనది. రామచంద్రరా జనుజుండనియును, పద్మనాభ రా జగ్రజుండు నని యెఱిఁగినయంశమేగదా, అట్లుండ నన్నకుఁ గృతినీయనిచోఁ దమ్మున కీకృతికన్యక నెటులఁ బరిణయము చేసెదరు. ఇది ధర్మశాస్త్ర విరుద్ధ మనుసంగతి కవికిఁ దెలియకున్నను మీయట్టియాజ్ఞికునికైనఁ దెలిసియుండవలసినదే. అయిన నేమాయెను ఇపుడు. చదువుచున్నకథా భాగములో నీకు నిర్దోషముగాఁగాన్పించుపద్యము నొకదానింజదువుము.

కృ. కవి. నా కన్నిపద్యములు నిర్దోషములుగానే కాన్పించు చున్నవి. ఇదివఱలో నిలచియున్నపద్యము తరువాయి పద్యముం జదివెదను. అది కృతిపతియొక్క ధర్మపత్నీ వర్ణనము, అని యీక్రింది పద్యముం జదివె.

చ. తరణిశశాంకు లాభరణదంభమున న్వదనాక్షి కైతవాం
    బురుహసితోత్పలాగ్రమున ముద్దియకుంతలదేశమాక్రమిం
    చి రొకనెపంబుగాననగు చివ్వనుచుం బరరూపయుక్తిని
    బ్బరముగ నంత సాంతముగ బ్రహ్మయొనర్చినసీమ పొల్పగున్.

అనుపద్యంబు విని లక్ష్మణ కవి రాజుంచూచి యిందులో నొక రహస్యము వ్యక్త మగుచున్నది. అది తెలిసినంగాని యీపద్యము నా కన్వయించదు. కావున దయచేసి నాసందియము నివారించఁ గోరెద నని యడిగెను. దానికి రాజు సమాధానము చెప్పెద నడుగు మనుడు ల. కవి యిట్లనియె.

ల. కవి. మీరాణికి నొకవైపుకంటిలోఁ బువ్వుగాని లేక రెండవ వైపుముఖభాగములో గొప్పపుట్టుమచ్చ గాని యున్న దా ?

రాజు. ఇది నాయనుభవమునఁ గనిపెట్టఁబడిన యంశముకాదు. ఇఁక ముం దిట్టిపుట్టు మచ్చ యుండినఁ గనిపట్టఁబడును. కన్నులలోఁ బువ్వులుగాని కాయలుగాని లేవని యిదివఱలో నున్న యనుభవము అనెను.

ల. కవి. అట్లు లేనిచోఁ గృ. కవి యీపద్య మిట్లు చెప్పుటకుఁ