పుట:Kavijeevithamulu.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

427

     "ఈశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్"

అని యూరకుండెను. అట్టిమాటకుఁ గ్రుద్ధుండై కృ. కవి యిట్లనియె :-

"క. దాశరథీశబ్దంబును, దా శరధిపరంబు చేయుద్వైయర్థికి దు
     ర్ధీశ క్తిబిడాలమునకు, నీశునకము కృష్ణమూర్తియే యెన్నంగన్."

అని కృ. కవి ఆవఱలోఁ బ్రయోగించిన యొకప్రయోగములోనితప్పుం జూపెను. ఇట్టి వాక్యంబులు విని ల. కవి నవ్వుచు నేను గౌరవార్థముగా నీ కృ. కవిని నుతించిన నీతఁడు తా నంతస్తోత్రమునకుఁ దగనని తాను శునకసామ్యము గలిగియున్న ట్లొప్పుకొనుచున్నాఁడు. ముందు దాశరథిశబ్దమునకు నేను చేసినప్రయోగములోని సాధుత్వము చూపి అనంతరము నేను కృ. కవిని చేసియున్నస్తోత్రముం జెప్పెద నని సభవారిం జూచి యిట్లనియె. దాశరథిశబ్దముతోనితవర్గ ద్వితీయవర్ణ మునకుఁ దద్వర్గములోని చతుర్థవర్ణముం జెప్పితినని శాస్త్రి దురాగ్రహావేశంబునఁ దా శునకమగుట కొప్పికొనుటయే కాక అట్లే ధ్వనియునుఁ జేయు చున్నాఁడు. దాశరథిశబ్దము సముద్రపరముగాఁ జెప్పంబడియున్నమాట నిజమే. అక్కడఁ దా శరథి అని నేను చెప్పియుండిన కృ. కవి చేసినయాక్షేపణ సరియైనది యే అయియుండును. నామతమున నది యట్లుగాఁ బ్రయోగింపఁబడలేదు. దాశ = పల్లీలయొక్క, రథ = రథములు అనఁగా యానపాత్రములు అట్టివి కలవాఁడు దాశరథి అని సముద్రపరముగా నుపయోగించితిని. ఇం దేమైన దోష మున్నదేమో వైయాకరణ శిఖామణులు నిర్దేశించి చెప్పెదరుగాక యనఁగా నచట నుండుపండితు లాపక్షములో దాశరథిశబ్దము నిర్దుష్టమే అని యొప్పికొనిరి. దానిపైని కృ. కవి పూర్వపక్షము చెప్పలేక యూరక చూచు చుండెను. అంతట లక్ష్మణకవి నవ్వుచు నిటులనే కృష్ణమూర్తి అని నేను ప్రయోగించిన శబ్దములోఁ గూడఁ కృష్ణకవి పొరుపడి తాను శునకముగా నొప్పికొనియె. చూచితిరే పాండిత్యమున నీకృష్ణశాస్త్రి దే గాక యితరులది పాండిత్యమా ! అని ఈశు = శివునియొక్క, నకము = బాణము, కృష్ణమూర్తి