పుట:Kavijeevithamulu.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

424

కవి జీవితములు.

ఈచరిత్రారంభములో నీకవి సకాలీనుల నుదాహరించి యున్నాఁడను. అందులోని యందఱతోడ నీకవి చరిత్రకు సంబంధమున్నట్లు వినియున్నాఁడను. వారిలోఁ గథలుగా వాడుకొనంబడునవి యీకవికిని శిష్టుకృష్టమూర్తిశాస్త్రి కవికిని నడచిన సంవాదాదికములై యున్నవి. ఇట్టివాని నుదాహరించుటలోఁ గవిచారిత్రములు ప్రకటించుతలంపే గాని వేఱుగాదు. కావున వారివారిప్రస్తుతసంబంధు లగువంశములవారు మాయెడ నాగ్రహించఁగూడదనియును ఈగాథ లిపుడు వ్రాఁతమూలములు గానియెడల మఱికొన్నిదినములకైన నివి బయలువెడలక మానవనియును అపుడు మనము చేసినమాత్రమైనఁ బరిశీలనచేయుట కవకాశముండక మఱికొన్ని యసందర్భవాక్యములు చేర్చఁబడుననియుఁ గావున నిదివఱలోఁ జేయఁబడిన పరిశీలనమునే యిపుడు ప్రకటింపుదు ననియుఁ జెప్పుచున్నాను.

కృష్ణమూర్తికవి గ్రంథరచనాకారణాదికము.

పైకృష్ణమూర్తిశాస్త్రికవికోటరామచంద్రపురము పరగణాలకు జమీదారుఁ డగుకాకర్లపూఁడి రామచంద్రరాజును దర్శింపఁబోవుడు నా ప్రభుండు కృష్ణమూర్తిశాస్త్రికవి విద్యావిశేషములు వినియున్న వాఁడు గావున తనపేరిట నొకగ్రంథము రచియింపఁ గోరెను. దానికి సమ్మతించి కృష్ణమూర్తిశాస్త్రికవి సర్వకామదాపరిణయ మనునొకప్రబంధమును తనప్రజ్ఞ వెల్లడి యగునట్లుగా రచియించి తెచ్చెను. అట్టిగ్రంథమును కృతి నందుతలంపున సుమూహర్తంబు నిశ్చయించుకొని ఆనాఁడు సభ చేసి గ్రంథము నందెద నని రాజు పైకవికిఁ దెలియఁబఱిచెను. కవియును దానికి సమ్మతించి సభకు నాహ్వానము చేయవలసినపండితులకుఁ బత్త్రికలు వ్రాయించి పంపుఁ డని కోరఁగా రాజు దానికి సమ్మతించి అప్పటికి రాఁదగుపండితుల పేరులు తెలుపు మని చెప్పెను. అపుడు కృ. కవి తనజ్ఞాపకములో నున్నకొందఱి పేరులు చెప్పెను. రాజసన్ని ధాన వర్తులు మఱికొందఱి పేరులు వక్కాణించిరి. వానికిని కృ. కవి సమ్మ