పుట:Kavijeevithamulu.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
31
వేములవాడ భీమకవి

5. హాసబిరుదాంకుఁడు - అనుబిరుదునకు హేసబిరుదగండఁ డని పాఠాంతరము గలదు.

6. ధారాపురీగహనదావధనంజయుండు - దీనికి ధారాపురీశుష్కారణ్యపావకుఁ డను పాఠాంతరము గలదు. ధారాపురము భోజునిముఖ్య పట్టణము. ఈభోజుఁడు విధర్భదేశాధిపతి. దీనికి Bidar అని యవనాదుల వలన నామంబు గలిగినది. ధారాపురిని జయించె నని చెప్పుటచే బీదరని చెప్పఁబడు విదర్భదేశము గూడ నాక్రమింపఁబడె నని చెప్పవలసి యున్నది.

7. గండధనంజయుఁ డని యున్నబిరుదునకు గండలకు ధనంజయుని వంటివాఁ డనియర్థము.

8. మేదినీరాయమృగవేఁటకారుఁడు - దీనికి మేదినీరాయ మృగసముదయచండమృగయుఁ డని పాఠాంతరము. సింహాచలమునొద్ద నున్న పొట్నూరునకుఁ బూర్వము ప్రభువులు మేదినిరావువారు. వీరిలో గృష్ణరాయని నెదిరించినయతనిని కళింగమేదినీవిభుఁ డని పెద్దనవలనం జెప్పఁబడియె. అట్టిమేదినీరాయనామముగల రాజును జయించుటంజేసి యీబిరుదు గలిగినది.

9. వీరకేదారుఁడు - ఇది వీరశ్రేష్ఠుఁ డని తెల్పును.

10. కృష్ణవేణీ జలక్రీడావినోదపరాయణుఁడు - తఱుచుగాఁ గృష్ణానదిలో స్నానముచేయుకుతూహలము గలవాఁడు. కొందఱకాలములో నమరావతియు మఱికొందఱకాలములో బెజవాడయును ముఖ్యపట్టణములై యుండెను. ఈరెండుస్థలములలోపలంగూడ కృష్ణానది ప్రవహించును గనుక నీబిరుదు సర్వత్ర చెల్లును.

11. ఖడ్గనారాయణుఁడు.

12. దుర్జయకులకులాచల కంఠీరవుఁడు.

13. రణరంగ భైరవుఁడు. - ఇవి చారిత్రమునం దెల్పు బిరుదులు కావు.