పుట:Kavijeevithamulu.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

422

కవి జీవితములు.

బలవిరాజితుండై, యాత్మీయామోఘగోశక్తి = తనసంబంధమగు వ్యర్థము కాని వాక్యసామర్థ్యము, ప్రకటం బగునట్లుగా విజృంభించిన.

రా. లలిన్ = సుందరముగా, మున్ను, అలబుధవైరికిన్ = ఆరావణునకు పొలుపునెఱయ నాభిముఖ్యముగనున్న సొగసుప్రకటనమగు నటుల నాభియందు ముఖ్యముగనున్న యట్టి, సుథాతులసద్బలము = అమృతముయొక్క యసమానమగు బలము, పేర్చు లక్ష్మణాగ్రజుని దివ్య కమలాప్తుండగు భగవంతున్ = లక్ష్మికి నాత్ముఁడగు భగవంతుని, ఆలక్ష్మణుండు, గారామునెఱయునానతిఁజేసి = ప్రీతిప్రకటమగునట్టి నమస్కారమును గావించినవాఁడై, గభీరభాషణంబులఁబలికెన్ = గంభీరవాక్యములను వక్ష్యమాణప్రకారముగాఁ బలికెను.

ల. లలి మున్ను, అలబుధవైరికిన్ = పండితవిరోధియగుదమ్మన్నకు, పొలుపునెఱయన్, అభిముఖ్యముగానున్న = స్వభావసిద్ధముగా నున్నట్టి, సుధాతులసద్బలము = శుభ మగుధాతువులయొక్కప్రశస్త మగుబలము, పేర్చులక్ష్మణాగ్రజుని దివ్యశుచిగోశక్తిన్ = వృద్ధినందుచున్నట్టి లక్ష్మణకవియొక్క దివ్యము లగునట్టియుఁ బవిత్రము లగునట్టియు వాక్యములయొక్క సామర్థ్యముచేతను, అడఁగెను.

రా. ఏపుచెడి = హెచ్చడంగి, నవకములడఁగి = తొమ్మిదితలలు పోయి, 'కంశిరోంబునోః.' అమరము. గోపాలతనూజు = దశరథరాజతనూజునియొక్క, అతను = అధికమగునట్టియు, గురు = శ్రేష్ఠమగునట్టిదియు, వాణీశ = బ్రహ్మసంబంధమగు, అస్త్రోపాసనము = అస్త్రముయొక్క యుపాసనము, అనఁగా బ్రహ్మస్త్రోపాసనమనుట, సఫలముగన్ = సార్థకముగ. ఆపరుఁడు = శత్రుడగునారావణుఁడు, హృదయము సెదరి = వక్షము వ్రక్కలై, అసువులఁబాసెన్ = ప్రాణములు వదలెను.

ల. ఏపుచెడి = అతిశయముపోయి, నవకములడఁగి = శరీరముయొక్కనవకముపోయి, గోపాలతనూజున్ = లక్ష్మణకవియొక్క, అతనుగురు = విష్ణువునుగూర్చినట్టి, వాణీ = సరస్వతినిగూర్చినట్టి, శాస్త్రోపాసనము = శా