పుట:Kavijeevithamulu.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

416

కవి జీవితములు.

ల. ధరన్ = పుడమియందు, నేను, ఇది, అధ్యాహారము శ్రీరామేడ్భక్తుఁడన్, గరిమన్ = గౌరవముచేత, నాదుకతన్ = నావృత్తాంతమును, విని, నమ్ము, నరసాజా = దమ్మన్నా, దురితము = ఈబ్రహ్మక్షేత్రాపహరణ దోషము, నినున్, అణఁచి = సంహరించి, నిరయంబునన్ = నరకమునందు, చేర్చు, ప్ర మాణవచనము. స్వదత్తాం పరదత్తాం వా యో హ రేతి వసుంధరాం, షష్టిర్వర్షసహస్రాణి విష్ఠాయాం జాయతే క్రిమిః" నెమ్మి = ఇష్టము, రాదు, ఇఁకన్, దొనఁగున్ = ఆపదను, ఒందన్ = పొందను.

రా. అమ్మా = ఓతల్లీ, నీకున్ కష్టము లేదు, అమ్మా ఇఁక నేగి = కీడును, భీతి = భయమును, ఏది = ఎక్కడ. నీవు, ఘృణన్ = జుగుప్సను, నిందననుట, ఒందన్ రాదు = పొందఁగూడదు, అమ్మా, మదుక్తిన్ నామాట, నిజము, పొలువుగదా = ఇష్టముగదా.

ల. దమ్మా = ఓదమ్మన్నా, లే = లెమ్ము, దమ్మా, కష్టము = ఆయాసము, సేగి = అనుభవమును, భీతి = భయమును, (నీ కేవచ్చునని శేషము,) దమ్మా. నీవు, ఘృణన్ = జుగుప్సను. ని. ఘృణా జిగుప్సా కృపయోః. జుగుప్స యనఁగా నింద. ఒందన్ = పొందుఁటకు, రా = రమ్ము, దమ్మా, ఇంకన్, మిన్నక = ఊరక, పో = వెళ్లు. ఓదమ్మా! మదు క్తి, నామాట, పొలుపుగన్ = ఇష్టముగా, నిజము = వాస్తవము.

61 రా. నీవు జీవితేశునికడకుఁ = ప్రాణనాథుఁ డగురామునివద్దకు. ని. జీవితేశౌ యమ ప్రియౌ. చనుసమయము, ఇదె వచ్చెను, వేగిరపడకుము = ఉద్బంధనాదియత్నమును జేయవలదనుట.

ల. అనియిట్లు, అనేకములు, పెంపు = వృద్ధి, ఎనయంగాన్ = ఒప్పఁగా, పలికి, నీకున్, జీవితేశునికడకున్ = యమునివద్దకు, చనుసమయము = వెళ్లెడుకాలము. ఇదె వచ్చెను = ఇదిగో వచ్చినది. వేగిరపడకుము = త్వరపడవలదు, అనుచున్ = చెప్పును. మఱియున్.