పుట:Kavijeevithamulu.pdf/421

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

415

ల. ఖరదూషణముఖ్యులు = రేఫలకారముల కభేదము, ఖల = దుష్టులగునట్టియు, దూషణముఖ్యులు = దూషించుటేముఖ్యముగాఁగల, కవిగురులు = కవిశ్రేష్ఠులు, నడచినట్టిత్రోవన్ = నడచినమార్గమును, కోరి, నడువన్ = నడుచుటకు, ఉద్ధురుఁడవు = భారమును వహించినవాఁడవు, అవు = అగునట్టి, నీదు = నీయొక్క, వాక్యవిసర = వాక్యసముదాయము యొక్క, పరుషత్వమునకున్ = కాఠిన్యమునకు, మదిన్, ఏను జంకుదునె = భయపడుదునా.

రా. విన్ము, ఏను, లక్ష్మణాగ్రజన్మమాన్యక్షేత్రము, రాము భార్యను, ఎపుడు, మానగుణము = మాన అభిమానమనెడు, గుణము, లేక, మాన గుణము, పాతివ్రత్యము = ద్వంద్వైకవద్భావము, విడువ, ఈవు, మద్వరోగ్రశక్తిన్ = మత్ నాయొక్క, వర = భర్తయొక్క, ఉగ్ర = భయంకరమైన శక్తిన్ = శక్తిచేత, లంకన్ = ఈలంకను, ఏలఁగలవాఁడను = పాలించఁగలవాఁడవు, అగుచున్, నెగడవు = వృద్ధినొందవు.

ల. ఓలక్ష్మణాగ్రజన్మ = ఓలక్ష్మణకవీ, విన్ము = ఆకర్ణింపుము, మాన్యక్షేత్రము = నీమాన్యమైనచేను, ఎపుడు, విడువన్ = విడిచిపెట్టను, గుణము, పరక్షేత్రాపహరణమును, మానన్ = మానను, మద్వరోగ్రశక్తిన్-మత్ = నాయొక్క, వర = శ్రేష్ఠమగు, ఉగ్ర = భయంకరమై, శక్తిన్ = సామర్థ్యమును, మానన్, మఱి = ఇంకను, ఈవు = నీవు, లంకనేలగలవాఁడవగుచున్ = లంకభూమిగలవాఁడవగుచును, నెగడవు = వృద్ధిఁబొందవు.

రా. ధరన్, ఏను, శ్రీరామేడ్భక్తుఁడన్ = శ్రీరాముఁడనెడు ప్రభువునకు భక్తుఁడను, గరిమన్, నమ్ము, నాదుకతనన్ = నావలన, విని = నీవృత్తాంతముననుట. రసాజాని = రాముఁడు, దురితము = ఈ పాపస్వరూపుఁడైన వావణుని, అణఁచి నినున్, రయంబునన్ = త్వరఁగానే, నెమ్మిన్ = ప్రియముతో, చేర్చున్ = తనసమీపమును బొందించికొనుననుట, ఇఁకన్, దొసఁగు = వ్యసనము, ఒందరాదు.