పుట:Kavijeevithamulu.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

414

కవి జీవితములు.

ల. ఒనరుమద్వాక్కులన్ = ప్రకాశించునట్టి నామాటలచేత, తెలుంగునకున్ = ఆంధ్రభాషకు, వాగనుశాసనుండైనను = ఆంధ్రవ్యాకరణ సూత్రములు చేసి భారతము గొంత తెనిఁగించిన నన్నయభట్టైనను, బద్ధుండగును = కట్టువడును, నాప్రయోగమందు తప్పెంచఁడనుట, అలఘు = విస్తారములగు, మత్ = నాయొక్క, దివ్య = ప్రకాశించుచున్న, గోచయంబులకు = మాటలకు, శ్రీ = శోభాయుక్తమగు, మనః = మనస్సును, వసు = ధనముగల, చోరుఁడైనను ఈపేరుగల కవియైనను, బద్ధుఁడగును = అంగీకరించు ననుట.

రా. ఓరామ = ఓసీతా, కన్యాదులు = పితృ దేవతలును, సూర = సూర్యుఁడు, ని. సూరసూర్యార్యమాదిత్య ద్వాదశాత్మదివాకరాః, అమరము కవి = శుక్రుఁడు, ప్రముఖ = మొదలుగాఁగల, పృథుప్రతిభావంతులు = గొప్పకాంతి గలవారు, భీమశ్రీనాథుల్ = శివకేశవులైనను, రూఢధృతిన్ = నిశ్చితమైన ధైర్యముచేత, వెలయఁగన్ = కూడఁగా, నాకరణి దిట్టలే = నావలె గట్టివారా? కారనుట.

ల. తెలియన్ = తెలియు నట్లు, విను రామకవ్యాదులు = తురగారామకవి మొదలగువారును, సూరకవి = పింగళసూరన, ప్రముఖ = మొదలుగాగల. పృథుప్రతిభావంతులు = అధికబుద్ధిశాలులు, భీమశ్రీనాథుల్ = వేములవాడ భీమన్నయు, శ్రీనాథుడును, ఊఢధృతిన్ = వహింపఁబడిన ధైర్యముచేత, నాకరణిన్ = నావలె, తిట్టలేరు = వారికన్న గట్టిగా బాధించునట్లు తిట్టెద ననుట.

రా. అతనితోన = రావణునితోనే, రసాసంతతి = సీత.

ల. అతనితోన్ = లక్ష్మణకవితో, నరసాసంతతి = దమ్మన్న.

రా. ఖరదూషణముఖ్యులు = ఖరదూషణులు ,మొదలుగాఁ గల, కవిగురులు = శుక్రుఁడు గురువుగాగలవారు, శుక్రశిష్యులు = రాక్షసులు, నడిచినట్టిత్రోవన్ = రామబాణ హతులైనవారు పోయినట్లనుట, కోరినడువన్, ఉద్ధురుఁడవు, అగు, మదిన్.