పుట:Kavijeevithamulu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
30
కవి జీవితములువ్రాయుట కవకాశమే యుండదు. కావున మనము ప్రకృతము ముందీ రెండుశాఖలవారింగూర్చి చెప్పఁబోవుగ్రంథమునకు సంగ్రహరూపమునఁ గొంత చెప్పినచారిత్రము అనంతరము ఆయాశాఖలవారికి వలయునేని ఆయాగ్రంథములు ప్రత్యేకము ప్రకటింతము. ఇదివఱలో మనము భీమకవిచారిత్రములోని మైలమభీమనవంశస్థులు మనదేశములోనిపూసపాటివా రని వ్రాసి యున్నాము. ఇపు డామైలమభీమనచారిత్రము నుడువుటకుముందు అతనివంశస్థు లగుపూసపాటివారిచేఁ బూర్వమునుండియు సంపాదింపఁబడినబిరుదము లెవ్వియో వానిం దెల్పి వానికాల మెద్దియో నిర్ధారణ చేసి యుంచుదము. ఇది ముందు మనము ప్రకటింపఁబో మైలమభీమనవంశచారిత్రమునకుఁ బీఠిక యై యుండును. అటులనే బడబానలభట్టుచారిత్రము వ్రాయుటకు ముందుగా నతనివలన శాసింపఁబడిన వెలమలలోఁ బద్మానాయకులను వెలమవారిలో ముఖ్యులగు రేచెర్లగోత్రమువారిబిరుదంబులు వ్రాసి యుంచిన దానికి నిది పీఠికయై యుండును గావున నీపత్త్రికలోఁ బూసపాటివారిబిరుదంబులును, వేంకటగిరివారి బిరుదములును, విశదీకరింతము. అవి యెట్లన్నను :-

పూసపాటివారిబిరుదులు.

1. శ్రీమన్మహామండలేశ్వరుఁడు - ఇది మండలాధిపతి యైనందు వలనం గల్గినది.

2. మహీమండలరాయఁడు - ఈబిరుదు మండాలాధిపత్యమున కధికమగుభూములను సంపాదింపగలిగియుండుటను దెల్పును.

3. మన్నెసురత్రాణుడు - దీనినే మన్యసుల్తాన్ అని హిందూస్థానీలోఁ జెప్పుదురు. ఇది యవనభాషలో మనేహాసుల్తాన్ అని యుండును. అనఁగా గొప్పప్రభు వని యభిప్రాయము.

4. దర్భజకులసంభవుఁడు - శ్రీరామచంద్రునికుమారునకుఁ గుశుఁ డని నామంబు గలదు. కుశశబ్దపర్యాయము దర్భ యనియు దర్భజకులజు లనఁగా కుశవంశసంభూతు లనియు నర్థము.