పుట:Kavijeevithamulu.pdf/419

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

413

లంకావిజయోదాహృతపద్యవ్యాఖ్యానము.

44. రాఘవార్థము. చలంబు వద్దు ఇఁకన్, ఓమానిని = మానవంతురాలా, ముదమ్ము = సంతోషమును, అనఁగా రూఢసత్కృపన్ = దయచేతను, మన్పుము = జీవింపఁజేయుము.

లక్ష్మణకవియర్థము = ఏన్ = నేను, నినున్, ఆశ్రయించి = అనుసరించి, హృదయేప్సితము = మనస్సునందున్న కోర్కెను, తీర్చికొందున్ అనన్ = అనెడు, పూనికన్ = ప్రతిజ్ఞచేత, చేరవచ్చినన్ = చేరఁగా, ననున్, కడకంటను = కీఁగంటిచేతనైనను, చూడవు ఏమి, ఇంపు = ఇష్టము, ఊనఁగన్, మాటలు, ఆడుటకున్, ఒప్పవు. ఇదేమి, చలంబు వద్దిఁకన్ = మత్సరముతో గలసియుండుటను, మాని, ఓదమ్మన్నా, ఇమ్ముమీఱఁగన్ = రహస్యము అతిశయింపగా, నిరూఢసత్కృపను = నిశ్చయమయిన దయను, మన్పుము = వృద్ధిబొందింపుము.

45. రా. లంకన్, విడచి, ఆనందగరిమము, అనఁదగదు, ఈ వ = నీవే, ననున్, పొందఁగదే.

ల. నగు మొగముతోడన్ = నవ్వుచున్నమోముతో, దయఇగురొత్తన్ = చిగిరింపఁగా, ననున్, చూచి, తాల్మిన్ = ఓరిమిచేత, ఎదన్ = ఉల్లమునందు వేడుక = కౌతుకము, మీఱఁగన్, లంకన్ = లంక నేలను, విడిచి, ఆనందగరిమము సంతోషాతిశయము, అనన్ = పొందఁగా, తగన్. దీవనను = ఆశీర్వచనమును, పొందఁగదే.

48. రా. ఒనరుమద్వాక్కులందున్, ఎలుంగునకున్ = కంఠమునకు, వాగను శాసనుఁడైనను = బ్రహ్మయయినను. బద్ధుఁడగును కంఠమెత్తి నేను మాట్లాడునపుడు బ్రహ్మయయినను నా కోడుననుట, అలఘు మద్దివ్యగోచయంబులకున్ = బాణపరంపరలకు, శ్రీ = లక్ష్మియొక్క, మనః = మనస్సనెడు, వను = ధనమునకు, చోరుఁడు = హరించువాఁడగు విష్ణు వైనను, బద్ధుఁడగును = ఓడుననుట.