పుట:Kavijeevithamulu.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

412

కవి జీవితములు.

గస్తి మితవచనాంగీకృత హరిమంత్రుం డై కమలాప్తుం డగుభగవంతు వేదవిధ్యుక్తము గా నిశ్చలభావంబున ధ్యానంబుజేసి తత్ప్రసాదలబ్ధదివ్యతేజో బలవిరాజితుండై ఆత్మీయామోఘ గోశక్తి ప్రకటం బగునట్లుగా విజృంభించిన.

క. లలి మున్నలబుధవైరికి, బొలుపు నెరయ నాభిముఖ్యముగ నున్నసుధా
    తులసద్బల మడఁగెను బే, ర్చులక్ష్మణాగ్రజుని దివ్యశుచిగోశక్తిన్.

   వ. తదనంతరంబ.

క. ఏపుచెడి నవకము లడఁగి, గోపాలతనూజునతనుగురువాణీశా
    స్త్రోపాసనము సఫలముగ, నాపరుఁడు హృదయము సెదరి యసువులఁ బాసెన్.

క. శ్రితుసరమాకాంతుని బుధ, సుతు నాసురవర్యు లక్ష్మణుం డాలంకా
    పతి గారామునెరయు నా, నతిఁ జేసి గభీరభాషణంబులఁ బలికెన్.

క. రవియును శశియును దారలు, నవనియు రాముకథ నుండునన్నాళ్లును దా
   నవనాథ విభీషణ లం,క విమతభయవిరహితంబుగా నేలు మిఁకన్."

ఇట్లు తన చారిత్రమును లక్ష్మణకవి కొంత గ్రంథస్థముగాఁ జేసెను. ఇట్లు స్వచారిత్రము వ్రాయుపద్ధతి ఆంధ్రులలో నంతకుఁ బూర్వమున్నట్లు కానరాదు. అయిన నిది యాంధ్రభాషకు నొకనవీన మగు నలంకార సంపాదన మని చెప్పవలసియున్నది. దీనింబట్టి లక్ష్మణకవిచారిత్రమతయుఁ దెలియకున్న మనకు నతనినాఁడు ముఖ్యకార్య మగు నష్టభూలాభముం దెలియఁజేయుటయే కాక దానితో సంబంధించినవృత్తాంతములు గొన్ని తెలియఁగలవు. తక్కినవానిలో మఱికొన్నిటి నిఁక ముందు మనము వ్రాయఁబోవు నీచారిత్రభాగములో వివరించెదము. అవి కేవలము గ్రంథస్థగాథలు కాకున్నను గోదావరీ మండలములోని సంప్రదాయజ్ఞుల వలన వాడుకొనంబడినవి గావునను, విశేషకాలముక్రిందటి వృత్తాంతములు కావు గనుకను కేవల మవిశ్వసనీయము లని చెప్పవలసినది లేదు. పైచారిత్రములోని పద్యములకు టీక ప్రకటించినఁగాని అందలిచమత్కారార్థము బోధ కాదు. కావున వాని నన్నిటి నొకచోఁ బ్రకటించెదను.