పుట:Kavijeevithamulu.pdf/414

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

408

కవి జీవితములు.

అచ్చట శివుని దర్శించి నమస్కారాదు లొనరించి యింటికిం బోయియుండె. అంతట నొక్కనాఁడు సరస్వతీదేవి లక్ష్మణకవియన్న యగురామకృష్ణయ్య యెదుటఁ బత్యక్షమై నిన్ను వరియింప వచ్చితిఁ గైకొ మ్మనుఁడు నాతఁడు తనతమ్ముం డగులక్ష్మణకవిం జూపి అతని వరియింపు మనుఁడు నట్లన చేసెను. లక్ష్మణకవి అభారతిని చేపట్టెను. వేదముల నుపనిషత్తులలోనియర్థముల నరసి ప్రసిద్ధికెక్కునట్లుగా బ్రహ్మతత్త్వమును గ్రహించెను. అని కొంతపూర్వోత్తరము చెప్పంబడినది.

ఇట నుండి లక్ష్మణకవి కవితాప్రాగల్భ్యము వర్ణింపఁబడెం గావున నతని మూలవచనమునే యీక్రిందఁ బొందు పఱిచెదను. ఎట్లన్నను :-

"వ. మఱియు సత్కృతిరచనావిచక్షణుం డగులక్ష్మణాగ్రజుండు విబుధాభినందితాత్మీయశ్లోకాసహిష్ణువు లై యిది మహాక్రియ యనక సుప్పనక వాక్యంబులన్నిటం దుర్బోధంబుఁ జెందినకతంబున నాగ్రహించి యెదిర్చినఖరదూషణముఖ్యు లగు విరోధులం దనశాస్త్ర బలసంపత్తిచేత జయించి నిజసామర్థ్యంబు ప్రకటంబుగ నెఱపు చున్నంత"

అని చెప్పెను.

దీనిచేత తనబద్యములయం దసూయాపరులై యున్నవారి ననఁ గా శత్రువులను తనశాస్త్రసామర్థ్యముచేత గెల్చి తనసామర్థ్యము లక్ష్మణకవి చూపుచుండె నని తేలుచున్నది. ఇ ట్లుండఁగా జయశీలుఁ డగు దమ్మన్న యనువెలమ లక్ష్మణకవియొక్కలంకనేల నున్నగోతిచేను అను భూమిని వివాదములోనికిం జేర్చెను. అపుడు లక్ష్మణకవి నల్లనై భూసారము గలతనబంకభూమిని హరింపఁగోరి దమ్మన్న తనతమ్ముఁ డగు భావన్న యనునతని నధికారికడకుఁబంపుట విని ఆవిషయములో సామోపాయము చేయుచుండెను. ఇట్లుండి లక్ష్మణకవి ప్రభునికడ కేఁగి తనలంకభూమికి మాన్యముగ పట్టా నందివచ్చెను. ఈవృత్తాంతమును దమ్మన్న విని మఱియును క్రోధము బూనినవాఁ డాయెను. ఇ ట్లుండి దమ్మన్న లక్ష్మణకవి కాభూమి చెల్లకుండఁజేయ యత్నింపసాగెను. పిమ్మట దమ్మన్న తనపాఁపురస్థల మగునారెవెట్ట మనుగ్రామమునుండి