పుట:Kavijeevithamulu.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమకవి

29మి కావున నతనిచే రచియింపఁబడిన భీమకవీయప్రశ్న మనునొకచిన్న జ్యోతిషగ్రంథమును, భీమకవిచందమునుగూడ నీచారిత్రముతోడనే వీలయినవఱకు ముద్రించెదము. భీమకవిచందము అతనిచే నతనికుమారున కుపదేశింపఁబడినట్లును ఆకుమారుఁడు దానిని గ్రంథముగాఁ జేసినట్లును ఆచందములోని యీక్రిందిపద్యములవలనం గాన్పించు చున్నది. అదియెట్లన్నను :-

క. పరఁగినవిమలయశోభా, సురచరితుఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
   పరిణతుఁ డయ్యును భూభృ, ద్వరవిమలప్రసాదితోద్భవశ్రీయుతుఁడై.

క. కమనీయ సమస్తకళా, గమములకును జన్మ భూమి కావ్యము కావ్యా
   గనువిదుఁడు సర్వవిదుఁ డని, సమయచతుష్టయమునందుఁ జదివిరి మొదలన్.

క. కావునఁగవిత్వతత్త్వము, భూవలయములోనఁ దలఁపఁ బూజ్యం బని స,
   ద్భావమునఁ జెప్పఁ గావ్యక, ళావేదులు పొగడఁ గావ్యలక్షణమహిమన్.

అనువీనివలన భీమకవికి సంతానము కల దనియు నందులో నొకరిచేత గ్రంథము గూడ రచియింపఁబడె ననియు మనకుఁ దెలియుచున్నది. ఆచందము మన మవకాశానుసారముగఁ గాలాంతరమునఁ బ్రకటింప నిశ్చయించినారము గనుక ప్రస్తుతము భీమకవిచారిత్రమున నుడువంబడిన యతని సమకాలీనులచారిత్రము మనకుఁ దెలిసినంతవఱకు వ్రాయుదము. అది దేశచారిత్రములోఁ జేరియుండును.

దేశచారిత్రము.

భీమకవికాలీనులచారిత్రము.

భీమకవిచారిత్రములో నుదాహరింపఁబడిన వారిలో మనము చారిత్రము వ్రాయవలసినవారు :-

1. మైలమభీమన యితనివంశము తెలుఁగు దేశపుక్షత్రియుల విషయమైనగాథలతో నొప్పియుండును.

2. బడబానలభట్టారకుఁడు. ఇతనికాలమున దేశములో వెలమలకు బిరుదులు మొదలగునవి గలిగినవిధము. ఈరెండువృత్తాంతములును మనము పూర్ణముగా వ్రాయుటకుం గమకించిన నిఁక దేశవృత్తాంతము