పుట:Kavijeevithamulu.pdf/408

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
402
కవి జీవితములు

లక్ష్మణకవి ప్రజ్ఞావిశేషములు.

ఇతఁ డాంధ్రగీర్వాణములలో విశేషప్రజ్ఞ గలవాఁ డని ప్రతీతి నందెను. అం దాంధ్రమున మిక్కిలి ప్రజ్ఞ గలవాఁడు. ఇతఁడు తెనాలి రామకృష్ణునివలె హాస్యస్వభావుఁడు. ఆకారణముచేత నితనిపేరు గోదావరీ మండలములో నాధునికులలో విశేషవిఖ్యాతిం జెందె అట్టిచమత్కారములలోఁ బెక్కులు రసహీనము లవుటంజేసి వానిలోఁ గొన్ని మాత్రమే యుదాహరింపవలసియుండును. అవి యథాస్థలములలో నవసరము ననుసరించి ప్రకటింపంబడును. ప్రస్తుత మతనిప్రధానగ్రంథ మగు లంకావిజయా పరనామక "రావణదమ్మీయముం" గూర్చి వ్రాసెదను. అం దొకకథ యతనిదియును, అతనికి విరోధి యగు రావు దమ్మారాయఁ డనునొక సామంతునిదియు నై యున్నది. ఇఁక రెండవ యర్థమునందు వచ్చెడుకథ కేవలము రామాయణకథయే అయియున్నది. అందు దమ్మరాయఁడే రావణస్థానీయుఁడు. కావున దానికి రావణదమ్మీయ నామము కల్గినది. కవిచరిత్రము కొంత పూర్ణముగా నతనిచే రచియింపఁబడిన గ్రంథమునందే యున్నది కావున నందలి సంగ్రహమే యీమనచరిత్రమునకుం జాలియుండును. అసంగ్రహమే వ్రాసెదను.

గ్రంథపీఠిక.

దీనిలో నీకవి గోపాలదేవుని కృతిపతిం జేసెను పిమ్మట శివ, చతురానసులను, రమా, గౌరీ, సరస్వతులను, వినాయకుని నుతించి, నవగ్రహములంగూడ వినుతించె. ఇట్లు నవగ్రహముల నుతియించుట నవీన కవులలో నవీనపద్ధతి. అనంతరము సంస్కృతాంధ్రప్రసిద్ధకవుల వినుతించె. అం దాంధ్రకవులంగూర్చి చెప్పినపద్యములలో వారికవిత్వ విశేషములు గొంచెము నుడువఁబడెంగావున నాపద్యము నీక్రింద వివరించెదను. ఎట్లన్నను :-

సీ. ఆర్యవర్యుని నన్న పార్యుని రమ్యయ, శోరాజి తిక్కనసోమయాజి
    రమణీయసుగుణాభిరాము నాచనసోము, రసికత్వసాంద్రు వెఱ్ఱసుకవీంద్రు
    సకలకవిసుతయశస్కరు భాస్కరు, గీతగుణసమాజు పోతరాజు
    భూసుతవాక్యభాషానాథు శ్రీనాథు, పృథుకకవిస్వాంతభీము భీము