పుట:Kavijeevithamulu.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

397

రా లోకమాతా మా. అమరకోశము. అనశబ్దమునకు, అన ప్రాణనే అనుధాతువు. వీనింబట్టి సరిచూచునది. 2

3. ఉ. అబ్జముఖీమనోజ నరసాధిపనందన కృష్ణ నీయశం
        బబ్జక రాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీపరాక్రమం
        బబ్జక రాబ్జజాబ్జనయనాబ్జవిలాసము నీ [1] విహాపితం
        జబ్జకరాబ్జజాబ్జనయనాబ్జవిలాసము చిత్ర మిద్ధరన్.

అర్థము. నీయశంబు = నీకీర్తి, అబ్జ = అమృతముయొక్కయు, కర = కాంతియొక్కయు, అబ్జక = చతురాసనునియొక్క, అబ్జనయనా = కమలములవంటి కన్నులుగల సరస్వతీదేవి యొక్కయు, అబ్జ = శంఖము యొక్కయు, విలాసము = కాంతివంటికాంతిగలిగినది. నీపరాక్రమంబు, అబ్జ = అనలము, కర = హస్తమందుగలశివునియొక్కయు, అబ్జజ, అబ్జ = హుతాశనునియందు, జ = పుట్టిన కుమారస్వామి యొక్కయు, అబ్జనయన = వనరుహాక్షుఁడైన శ్రియఃపతియొక్కయును, అబ్జ = అర్ఝునుని యొక్కయును, విలాసము = విలాసమువంటి విలాసముగలది, నీవిహాపితంబు = నీయొక దాతృత్వము. ఆబ్జ = సముద్రములలో, కర = శ్రేష్ఠమైన సముద్రమును, అబ్జ = సూర్యునియందు, జ = పుట్టిన కర్ణు నిన్ని, అబ్జ = నిధిని. నయన = పొందినకుబేరుని, అబ్జ = చంద్రుని, వి = విశేషముగా, ల = గ్రహించుటకు, ఆసము = స్థానమైనది.

ఇందుకు నిఘంటుప్రమాణములు :-

అబ్జశబ్దమునకు. అబ్జ శ్శశాంకే విజయే జ్వలనేజ్వలశంబుధౌ. అని శుభాంగుఁడు. కించ. అబ్జః పద్మే ఽర్జునే హేమ్నిమీనే చన్ద్రే ప్రభాకరే. అని విజయుఁడు. మఱియు, కించ అబ్జః పద్మే సుధాయాంచ తపనే పావకే దధే,స్కన్ధే చన్ద్రే శ్వేతవాహే సముద్రే కనకే నిధౌ. మఱియు, అబ్జ స్సుధాయామిందౌచ నిధౌ శక్తిధరేఽనలే. ఉత్పలమాల. కించ. అబ్జో ధన్వంతరౌ శంఖే శశాంకే చ షడాననే వైజయంతి. కర శబ్దమునకు. కరో వర్షోపలేహస్తేభానౌ తటితి వారిదే, ఉపదాయాం ద్యు

  1. వితీర్ణి యున్.