పుట:Kavijeevithamulu.pdf/402

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
396
కవి జీవితములు

     బారభమానతారకరహారసమానము నీనికేతనం
     బారభమానతారకరహారసమానము చిత్ర మిద్ధరన్.

అర్థము. నీయశంబు = నీకీర్తి, ఆర = పాదరసముతోడను భ = నక్షత్రములతోడను, మాన = తుల లేని, తార = వెండితోడను, కర = వర్షోపముల (వడగండ్ల)తోడను, హార = ముక్తామణిరసములతోడను, సమానము, నీ భుజామహంబు = నీ బాహుప్రతాపము, ఆర = అంగారకునితోడను, భ = ఆ నలునితోడను, మాన = విద్రుమమతోడను, సమానము = సరియైనది. నీ నికేతనంబు = నీగృహము, ఆర = ధనమునకును, భ = ఈశ్వరునియొక్క, మా = సంపదవంటి సంపదగలిగిన, ఆనత = నమ్రులైన, ఆర = అరిసమూహముయొక్క, కర = కానుకులకును, హా = వీణెలయొక్క, రస = ధ్వలనుకును, మా = లక్ష్మికిని, ఆస = స్థానమయినది.

వీనికి కోశప్రమాణములు :-

ఆరశబ్దమునకు. ఆరస్తు పారదే విత్తే భౌమే వాయుసుతే రవౌ. శాశ్వతుఁడు. భశబ్దమునకు. భశ్శంభౌ భ్రమరే భావే శుక్రాంశేజల దేవుమాన్. మఱియు, భస్స్యాన్మధూకేశుక్రేచ. నానార్థరత్నమాల. మానశబ్దమునకు. మానస్తు నిస్తులే వ్యోమ్ని విద్రుమే జ్వలనే ద్యుతౌ, చిత్తేఽభిమానే ప్రమదే విమానే పరిమాణకే. కేశవనిఘంటువు. మఱియు, మానో మణౌచకనకే విమానే విద్రుమే ద్యుతౌ, గర్వే ప్రమాదేహృదయే నిస్తులే నికలీనివత్. విశ్వము. తారశబ్దమునకు, తారోముక్తాఫలే శుద్ధే రజతేకనకేఽపిచ, నక్షత్రేతరలేశ్రేష్ఠే కాంతారం హాసిలక్షణఃహలాయుధనిఘంటువు. కరశబ్దమునకు కరో వర్షోపలే హస్తే భానౌ తటితి వారిదే, ఉపదాయాం ద్యుతౌ శ్రేష్ఠే శున్డాయాం ప్రత్యయోధనమ్. హైమవతి. హారశబ్దమునకు "హరిహింసా మతౌ హారే వాసవే కనకేఽంబరే. కేశవనిఘంటువు. మఱియు, హార శ్చక్రే వరే నస్త్రే భూతుకేహేమ్ని మౌక్తికే. ఉత్పలమాల. హశబ్దమునకు, హత్యాగే గతివీణయోః రసశబ్దమునకు. రస శబ్దే అనుధాతువు. మాశబ్దమునకు. ఇంది