పుట:Kavijeevithamulu.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

394

కవి జీవితములు

న్నాను. కాఁబట్టి అందుకుగా నాతనిచే నీయంబడినవిశేషములు రామరాజభూషణునివిగా భావించి గ్రహింపఁబడవలసినది. భట్టుమూర్తి యఱవదిసంవత్సరములు జీవించి తనయింటివద్దనే కాలధర్మము నందె నని వ్రాయంబడియున్నది. దీనికి వేఱువ్రాఁతలయాధారము లేదుగావునఁ బాఠకు లెట్లు గ్రహించినను జిక్కు లేదు. టెయిలరుదొర వ్రాసిన దెట్లనఁగా :-

vide page 206 vol. 2 Catalogue Raisonnee by the rev. W. Taylor.

దీనింబట్టిచూడఁగా బై టెయిలరు దొరగారికే కాక వారికి నరసభూపాలీయము బోధపఱిచినపండితులకుఁగూడ నరసభూపాలీయపురాజులపరిజ్ఞానము లేనట్లు కానుపించును. అట్లు కాకున్న భట్టుమూర్తి నామాంతరము తిమ్మరా జనియును, ఆగ్రంథము కృష్ణరాయలతండ్రి యగునరసరాజునకుఁ గృతియియ్యఁబడినదనియును, అందులఁ గృష్ణరాయలవంశావళి యున్నదనియును, ఆగ్రంథము ప్రబంధాలంకారములనే కాక నాటకసంప్రదాయములంగూడ చెప్పుననియును జెప్పుట తటస్థించదు. దానిని మనము పరిశీలించి చూడఁగా నది కృష్ణరాయలతండ్రి యగునరసింగరాయనిపై నీయఁబడిన కృతి కాక తొరగంటి నరసరా జనునొకసామంతప్రభున కీయంబడినట్లును, ఈ నరసరాజు కృష్ణరాయనివలె చంద్రవంశపురాజు కాక సూర్యవంశస్థుఁ డైనట్లును, ఆకృష్ణరాయనివంశము వర్ణింపఁబడనట్లును, అందు నాటకములతోఁ జేరినభాగమంతయు వదలివేయఁబడనట్లును స్పష్ట మగును. కాఁబట్టి యిట్టిసంశయములు దీర్చుపట్టుల దేశస్థు లగుపండితులే పొరపడుచుండఁగా నిఁక నితరదేశీయు లగునాంగ్లేయపండితులు పొరపడుట కేమియబ్బురంబు? ఇట్టిపట్ల మిక్కిలి మెలఁకువతోఁ బరిశీలించవలయు నని పాఠకుల నుత్సహించెదను.

పంచ పాషాణములు.

వాని టీకయును.

1. ఉ. భండనభీమ ని న్నెదిరి పాఱక నిల్చినశాత్రవుల్ బృహ
       న్మండలపుండరీక హరినాకనివాసులు పాఱియున్ బృహ