పుట:Kavijeevithamulu.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

393

లోను భట్టుమూర్తి కృష్ణదేవరాయలకాలములోనివాఁ డని పైద్వాత్రింశన్మంత్రి చరిత్రములోవలెనే వ్రాసియున్నది. అందులో నీతఁడు కృష్ణదేవరాయని యాస్థానాష్టదిగ్గజములలో నొకండుగా నున్నట్లును, కృష్ణదేవరాయలు జీవించియుండఁగా నితఁడు నరసభూపాలీయగ్రంథమును రచియించినట్లుం జెప్పెను. ఇతఁడును (REV. TAYLOR) దొరవలె నీనరసభూపాలీయము కృష్ణదేవరాయల తండ్రియగునరసరాజుపై రచియించియుండెనని యభిప్రాయపడి యున్నట్లు తోఁచెడిని అట్లు కాదనియును టెయిలరుదొరవలన వ్రాయఁబడినవ్రాఁత పొరపా టనియును చెప్పెదను.

అందులో వసుచరిత్రము నీభట్టుమూర్తి రచియించినట్లే యున్నది. అది పొరపా టని యిదివఱకే నాయుపన్యాసములోఁ జూపించియు