పుట:Kavijeevithamulu.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

387

బునకు వచ్చెను. ఇతఁడే వసుచరిత్రను గృతినందినరసికుండు. ఈవృత్తాంతంబు స్పష్టపఱుచు వసుచరిత్రంబులోని పద్యము . -

క. అ రామశౌరిపిమ్మట, ధీరామరశాఖి వీరతిరుమలరాయం
    డా రామసేతుహిమవత్, క్ష్మారమణీరమణుఁ డై జగంబు భరించెన్.
                                                          ఆశ్వా 1. ప. 55.

ఇతనిచెల్లె లైనలక్కమాంబకుఁ బుత్రుం డైనయహోబల నరసభూపాలుఁ డితనికి మంత్రిగ నుండియుండెను. రామభూషణుఁడు మేనమామపేర వసుచరిత్రంబును, భట్టుమూర్తి మేనల్లునిపేర నరసభూపాలీయంబును రచియించిరి. ఇంతవఱకు తెనాలిరామకృష్ణుం డున్నట్లు మనకు దృష్టాంతము లున్నవి. అతనిపాండురంగవిజయంబు నీకాలంబు నాఁటిదే. ఈకాలంబులోనివసుచరిత్రంబుఁ జూచి యాముక్తమాల్యద రచియింపఁబడె నని చెప్పుటకంటె వింత యింకొకటి గలదే. ఈతిరుమలరాయనితో రామభూషణ రామలింగములనామంబు లంతరించెను. తిరుమలరాయనియనంతరము వేంకటాద్రి యనుశ్రీరామరాజు రెండవతమ్ముఁడు రాజ్యమునకు వచ్చెను. అతనికడ నోబమాంబ యనురెండవ సహోదరికుమారు లగుగొబ్బూరినరసరాజును జగ్గరాజును మంత్రులు. అందు రామాభ్యుదయంబు గొబ్బూరినర్సరాజుపేరిట రచియింపఁబడెను. దీని రచియించినవాఁడు అయ్యలరాజు. రామభద్రకవి, ఇతనితోఁగూడ భట్టుమూర్తి యున్నట్లు మనకు నిదర్శనంబులు గాన్పించెను. కృతిపతులకుఁ గలసంబంధంబులును కవులజీవితకాలంబులను వాక్రుచ్చితిమిగావున నిఁక వీరిగ్రంథవిశేషంబులు వ్రాయంజనును.

వసుచరిత్రమునకుఁ గల్గినవిఘ్నము.

(1) రామభూషణుఁడు వసుచరిత్రమును గృష్ణరాయనికాలంబున రచియించినట్లును దాని నతఁడు కృతినందకుండ రామకృష్ణుం డంతరాయంబు కల్పించినట్లును బిమ్మట రామభూషణుఁడు వాని నెంతయుఁ బ్రార్థింప నతఁడు రాజుకడకుం జని యొకయుపాయంబు చెప్పెద నని దాని మృతు లగునితరవంశీయులకుఁ గృతి నిప్పించి పిమ్మట దానిఁ బిం