పుట:Kavijeevithamulu.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

384

కవి జీవితములు

ఉ. నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం
    దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధా రాసుధా రాశిసం
    జనితైకైకదినప్రబంధఘటికా సద్యశ్శతగ్రంథక
    ల్పను సంగీతకళారహస్యనిధిఁ బిల్వం బంచి పల్కెన్ గృపన్. ఆశ్వా 1. ప 16

అను నీపద్యమువలన రామరాజభూషణుఁడు శ్రీరామ ఆంజనేయో పాసకుడనియు, ఏకదినప్రబంధఘటనాసమర్థుఁ డనియును, నద్యఃకాలమున నూఱుగ్రంథము లనఁగా ననుష్టుప్పులు చెప్పఁగల డనియును, సంగీత శాస్త్ర రహస్య వేది యనియుం దేలినది. ఇంతియకాక ఆశ్వాసాంతగద్యమువలన నీతఁడు సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్యసర్వంకషుఁ డనియును, చతుర్విధకవితానిర్వాహకుఁ డనియు, సాహిత్యరసపోషణుఁ డనియును దేలుచున్నది.

కాని వీర లిర్వురు కృష్ణరాయల కన్యు లగు రాజులఁ గృతిపతులఁ జేయుటకుఁ గారణంబు న డువమైతిమి. దానిఁగూడ వివరించినపిమ్మట వీరివ్యాపారాదుల వ్రాయవచ్చును. మన మీవఱకే రామభూషణాదులు కృష్ణరాయలకాలంబునఁ బిన్న వయసున నున్న వారని తెల్పితిమి. వా రందఱు నాతనియనంతరము తత్సింహాసనము నధిష్టించినరాజుల కడ మిగులఁ బ్రబలి గ్రంథంబుల రచియించిరి. కృష్ణరాయలయనంతరము జరిగినవృత్తాంతము కొంత తెలిపి పిమ్మట నీగ్రంథోత్పత్తులంగూర్చి వ్రాతము.

కృష్ణరాయలు శా. సం. 1453 మృతినొందెను. అపుడు తత్సింహాసనము కృష్ణరాయని యన్నకొడు కగునచ్యుతరాయనిచేఁ దీసికొనంబడియె. ఈతనికి నల్కయతిమ్మన యనుకృష్ణరాయసేనాని సహాయం బొనరించెను. ఈయచ్యుతరాయఁడు నాలుగైదువత్సరములు రాజ్యంబు సేసి తుదిఁ దురుష్కులతోఁ బోరి కాలగతిం జెందె. అపు డాతనిపుత్త్రుని నీతిమ్మరాజు సింహాసన మెక్కించె. ఈబుడుతఁడు పదివత్సరంబులవాఁడై యుండుటంజేసి యీతిమ్మరాజు వానిం దనపోషణలోనుంచి