పుట:Kavijeevithamulu.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
27
వేములవాడ భీమకవిక సమయమున భీమకవి యాయూరికిఁ బోయి యుండఁగా నాయూర నుండువా రెవ్వరును భీమకవి నివసించుటకు బస నొసఁగక యుండి రనియు దానికిఁ గనలి భీమకవి యా యూరు త్వరలోనే పాడువడు నని శాపం బిచ్చి యధేచ్ఛం బోయె ననియు నాఁడుమొదలు ఆచళుక్య భీమవరము భూమిలోఁ గలసె ననియుఁ జామర్లకోట భీమవరము గ్రామ వాస్తవ్యులచే నేఁటికిని వాడుకొనంబడుచున్నది. చామర్లకోట కాలువ గుండ రాజమహేంద్రవరమువైపు పోవుచో హుసేనుపురము సమీపమున నొకప్రాచీనదేవాలయము గాన్పించును. ఆదేవళము మొదలు ప్రస్తుతపు భీమవర భీమేశ్వరదేవళమువఱకును పూర్వపుభీమవరములోని యొక వీథి వ్యాపించి యుండె ననియు నటులనే యూరంతయు దానిం జుట్టుకొని యుండె ననియు నాయూరు దిబ్బ చేరు ననుభయము గలవారందఱును ఆపాడు వదలి దానికి అర్ధక్రోశముదూరమున నున్న చామర్లకోటదగ్గర నిపు డుండుభీమవరము కట్టుకొని ప్రవేశించిరనియు వాడుక గలదు. అయితే చామర్లకోటలో నుండెడు కోటయును నీభీమవరమును నవీనములుగా కట్టఁబడి యుండనోవును. ఆకోటకే చామర్లకోట యనునామంబు లేక భీమవరముగానే వాడుక గల్గి యుండు నని శ్రీనాథునికాలమునాఁటికిఁగూడఁ జళుక్యభీమవరనామంబు వ్యా ప్తంబైయుండుటంజేసి యూహింపనై యున్నది. శ్రీనాథుఁడు తనవీథినాటకములో తెనుఁగురాయని కస్తూరి యిప్పించు మని కోరి చెప్పినపద్యములో నీయూరియుదాహరణ మిచ్చి చెప్పినపద్యము.

శా. అక్షయ్యంబుగ పాంపరాయనితెలుంగాధీశ కస్తూరికా
    భిక్షాదానము చేయరా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
    దాక్షారామచళుక్యభీమవరగంథర్వాస్సరోభామినీ
    వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్.

రణతిక్కన బ్రతికించుట.

ముప్పదియిద్దఱు నియొగులపద్యములో రణతిక్కనంగూర్చి వ్రాయుచో తిక్కన రణమందు హతు డయ్యె ననియు నతనిభార్య