పుట:Kavijeevithamulu.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

కవి జీవితములు

థంబునఁ దనతండ్రిపేరు స్పష్టీకరింపకుండుటంజేసియు నతఁడును హనుమదుపాసనాపరుం డౌటంజేసియు నతఁడే భత్తుమూర్తి యని చెప్పినపల్కులు నిజమా యేమి? యని తోఁచుచున్నది. గ్రంథంబులు రెండునుం జదువునపుడును మనము వినుచున్నకథంబట్టి యోఁచించునపుడును గొన్నిసంశయములు బుట్టుచున్నవి. మనము వినుచున్న వృత్తాంత మెద్దియనిన భట్టుమూర్తి ముందు వసుచరిత్రంబు రచించి యనంతరము నరసభూపాలీయమును విరచించె నని కాని వసుచరిత్రము రచించినకవియే పిమ్మట దీని రచియించునటు లైన నిందలిశయ్యావిశేషంబు లంతకంటెను బ్రౌఢంబుగ నుండవలయు. లేకున్న దానికి సమానంబుగ నైన నుండవలయును. అటుగాక న్యూనం బగుటకుఁ గారణం బేమియని యూహింపవలసియున్నది. ఇట్టిభేదంబులు రెండుగ్రంథములలోనికొన్నికొన్ని పద్యంబులు గైకొని వాటిరసపుష్టిం బరీక్షించిన స్పష్టంబు లగు. ఇంతియకాక వసుచరిత్రకారుఁడు తనకు మూర్తి యనునామాంతర మున్నట్లు చెప్పఁడు. నరసభూపాలీయ కారుండును తనకు రామభూషణనామ మున్నట్లు జెప్పియుండలేదు. నామాంతర మున్నయెడల నెఱ్ఱప్రెగ్గడయుంబోలె దానిని వివరింపక మానఁడు, వసుచరిత్రంబు తచించినయనంతరము రామభూషణునకు సాహిత్యరసపోషణుఁ డని బిరుదు కల్గెను. అట్టి బిరుదునే మఱియొకగ్రంథంబు విరచించు తఱిఁ గవి యొకఁడైన తప్పక నుడువును. అట్లు నరసభూపాలీయంబు నందు లేదు. ఈయిరువురుకవులకు సాహిత్యవిషయంబు లైనకొన్ని ప్రజ్ఞలు సమానములుగఁ జెప్పఁబడియె. వసుచరిత్రకారుఁడు సంగీతకళా రహస్యనిధి. ఇతఁడే వీణియలకు మెట్లు కల్పించినాఁ డని యున్నది. దీనింగూర్చి మఱియొకస్థలములో వివరించుట యైనది. అట్లైన నీతండు వుంభావసరస్వతి యని చెప్పవలదా ? అగును కాకున్న ని ట్లేరికి సంగీతసాహిత్యపాండిత్యంబు గలదు ? ఇంతియకాక యాశ్వాసాంతంబుల నీయిర్వురిప్రజ్ఞలు వేఱ్వేఱుగ నున్నట్లు చెప్పంబడియె. ఇట్లుండ నీయి