పుట:Kavijeevithamulu.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

379

జెప్పియుండిరి. తిరుగ వారు పిఠాపురము మొదలగుస్థలములకు వచ్చియుండిరిగాని వారు తెచ్చి యిచ్చెద మనినపద్యములు తెచ్చి యియ్య లేదు. నాఁటనుండియుం గొన్ని చాటుధారలు మాత్ర మచ్చటచ్చట వ్యాపకములోనికి వచ్చుటఁ జూచుచున్నాఁడను. వానికి కారణము పైబట్రాజులు కావచ్చు నని యోఁచించెదను.

రామభూషణునికథ ముగించుటకుఁ బూర్వ మతనిపినతండ్రికొడు కై అతఁడే యితఁ డని యూహించి భ్రమ నందించుచున్నభట్టుమూర్తింగూర్చి కొంతవ్రాయుచు నాసందర్భములో రామరాజభూషణుంగూర్చి మొదట నావలనఁ గవిజీవితము రెండవభాగములో వ్రాయంబడినచారిత్రము పూర్వమువలెనే వక్కాణించి అచట నచట తిరుగ రామభూషణుని కవిత్వశయ్యాదుల నుడివెదను.

భట్టుమూర్తి.

ఈవఱకును మన మల్లసానిపెద్దనచారిత్రములో వాక్రుచ్చిన భట్టుపేరు మూర్తి. అతనినే జనులు భట్టుమూర్తి యని మూర్తిరాజనియు వాడెదరు. ఇతనివృత్తాంతముం గొంత యిదివఱకే పెద్దనచారిత్రములో వ్రాయంబడినది. ఇతనికిఁ గృష్ణరాయనియాస్థానపండితుఁడని విశేషవిఖ్యాతి గలదు. ఆరా జీకవిని బహుభంగులుగా గారవించి తుదిని తనసింహాసనార్ధమునఁ గూర్చుండఁ బెట్టె నని వాడుక గలదు. నరసభూపాలీయగ్రంథరచనాకుశలుఁ డితఁడే యని యిదివఱకే చెప్పి యుంటిమి. ఆగ్రంథము కృష్ణరాయనిర్యాణానంతరము మఱికొంతకాలమునకుఁ బుట్టినది.

కృష్ణరాయలకాలములో నీతఁడు గ్రంథము లేమియుఁ జేసినట్లు కాన్పించదు. చాటుపద్యంబులు విశేషంబుగఁ జెప్పియుండె, వసుచరిత్రంబు రచించినవాఁ డీతఁడే యని ప్రసిద్ధి గలదు, దానికి పై రెండుగ్రంథంబుల దృష్టాంతము లేమియు గానరావు. అయిన వసుచరిత్రములోనిజాడలు కొన్ని దీనిలోఁ గాన్పించుటఁజేసియు వసుచరిత్రకారుఁ డాగ్రం