పుట:Kavijeevithamulu.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

కవి జీవితములు

అని యిట్లు కొన్నిటిని మాత్రమే వివరించినాఁడను ఇఁక నితర వర్ణనలో ననఁగా స్త్రీశృంగారవర్ణనలో చంద్రాద్యుపాలంభనలలో మన్మథాదివర్ణనలలో నితరము లైనబుతువర్ణన పుష్పలావికావర్ణనాదులలో మనుచరిత్రకారుఁ డూహింపని వర్ణన లనేకము లున్నవి. వానిని గ్రంథము చదివియే తెలియవలెఁగాని వ్రాయ వీలులేదు. హరిశ్చంద్రనలో పాఖ్యానము రాఘవపాండవీయముకంటె మిన్న యై యున్నదనుటకంటె విశేషించి చెప్పను.

భట్టురామరాజభూషణునిజన్మస్థానాదివిషయము.

దీనింగూర్చి యిదివఱలో నొకరిద్ద ఱొకటిరెండువిధముల వ్రాసియున్నారు. అం దాంధ్రకవిచరిత్రములో నితనిజన్మభూమి భట్టుపల్లె యనియును, ఈగ్రామము కృష్ణదేవరాయలవలనఁ గవిత్వమునందు ప్రవీణు లై ప్రబంధాంకమువా రని బిరు దందినయీతనిపూర్వు లగుభట్టురాజుల కీయఁబడె ననియు, నీగ్రామము బళ్లారి మండలములోని పాలమండలం తాలూకాలో నున్నట్లు కొందఱును, కడపమండలములోని పులివెందులతాలూకాలో నున్నట్లు మఱికొందరు చెప్పినట్లు నున్నది. దీని కాధారము లేమియుం జూపఁబడలేదు.

ఇఁకఁ గృష్ణామండలములోనిమోదుకూ రనుగ్రామములో నుండుకొందఱు బట్టుకులస్థులు తాము భట్టుమూర్తి వంశస్థుల మనియు నాతనికాఁపురస్థలము తమగ్రామమే యనియు కొంత కాలముక్రిందట కాకినాడలో నాతోఁ జెప్పియుండిరి. కాని తమకును భట్టుమూర్తికి నెందఱుపురుషులు మధ్యను గలరో ఆవృత్తాంతముగాని వంశవృక్షముంగాని చూపలేరైరి.

భట్టుమూర్తి, రామరాజ భూషణుఁడు అనుపేరులు గలపురుషు లొక్కరే యని ప్రప్రథమములో నాతోడ వాదించినవారు వారే. అప్పటిలో అట్టితమవాదమున కనుకూలము లైనచాటుధారలం జదువలేదు. కాని తమదేశమునం దున్నట్లును వానిం బం పెదమనియును నాతోఁ