పుట:Kavijeevithamulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

కవి జీవితములు

ద్యా సౌఖ్యం ధనం యశః, అంతే మహద్భయం చైవ కార్యభంగనిదర్శనాత్. మందజీవభుజం గేషు పుత్త్రాలాభో ధనాగమః, యోషిత్సంగం చలభతే క్షీర సాగరదర్శనాత్. 53. శనిశుక్రార్కిసంయోగే స్థానభ్రష్టం స్థిరం యశః, అంతే మహద్భయంచైవ కార్యభంగనిదర్శనాత్. 54. ద్వయార్కికుక్రసంయోగే సంస్థిరాశ్చ సుఖాదయః, గమనే కలహం రూఢిః రూపరాగప్రదర్శనాత్. 55. మందాహిగురుసంయోగే సుస్థిరశ్చ సుఖోదయః, గమనే భూషణం భూతిః పుత్త్రజీవ ప్రదర్శనాత్. 56. రాహుభాను కుజేషు స్యా ద్రాజ్యలాభో ధనాగమః, స్థానే స్థానే తు పూజ్యంతే మిత్త్రలాభప్రదర్శనాత్. 57. రాహుచంద్రేందు సంయోగే యాత్రాసిద్ధి స్సమాగమః, స్నేహవృద్ధి శ్చ భవతి శంఖవస్త్రప్రదర్శనాత్. 58. రాహుమంగళ భానూనా ముదయే మంగళోత్సవః, సర్వశత్రుజయావాప్తి ర్దేవేంద్రస్య ప్రదర్శనాత్. 59. రాహు సౌమ్యభుజం గేషు శత్రునాశో ధనాగమః, కార్యసిద్ధిశ్చ భవతి మహామేరుప్రదర్శనాత్. 60. భుజంగజీవమందేషు తేజోవిజయ వృద్ధయః,రాజపూజా భవే ద్వృద్ధి ర్మహాలక్ష్మీప్రదర్శనాత్. 61. రాహుశుక్రసితేషు స్యా ద్వ్యర్థతా కార్యనాశనం, శత్రుపీడాచ భవతి నష్టచంద్రప్రదర్శనాత్. 62. రాహు ర్మందో గురుశ్చైవ యాత్రా మర్థఫలం భవేత్,పశ్చాత్క్రమేణ సౌఖ్యంచ దధికృత్యనిదర్శనాత్. సరాహురాహు సౌమ్యాశ్చ థనలాభో భవేత్సుఖం, గమనే రాజపూజాచ పూర్ణకుంభ ప్రదర్శనాత్. 64. [1]

సంపూర్ణము.

ఈభీమకవి శాపానుగ్రహసమర్థుఁ డనుటకు మఱియొకకథ గలదు, అదియెట్లనఁగా :-

చామర్లకోట యనుగ్రామమునకు సమీపమున భీమవర మను నొకపట్టణము గలదు. అది పూర్వకాలమున చళుక్యభీముఁడు కుమార భీముఁడు అనునొక రాజ్యవరునకు ముఖ్యపట్టణమై యుండెను. ఒకానొ

  1. ఈకవి నృసింహపురాణమును రచియించినాఁ డనియు, దానిలోనిదే యీపద్యమనియు నీనడుమ ముద్రిత మై వెలసిన నన్నెచోడుని కుమారసంభవ భూమికలో వ్రాయఁబడి కాననయ్యెడిని. /div>

    ఉ. వాండిమి నల్ల సిద్ధిజనవల్లభుఁ డోర్చినరాజు భీరుఁ డై
    యాండ్రను గానకుండ వృషభాంకము పెట్టికొనంగఁ జూచితో
    నేండిదె యేమి నీ వనుచు నెచ్చెలులెల్ల హసింప నంతలో
    మూండవకంటితోడ దొరమూర్తి వహించిన మ్రొక్కి రంగనల్.