పుట:Kavijeevithamulu.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

370

కవి జీవితములు

4. కాకమానిమూర్తి కాద్రవేయాధిపవరప్రసాదకవితావిలాసుఁడు = భట్టుమూర్తి హనుమత్ప్రసాదాసాదిత కవితావిలాసుఁడు.

ఇట్లించుకయైన వర్ణ సంబంధము లేనియియ్యిరువురు నొక్క రేయని చెప్పుచుఁ గాకమాని మూర్తివిషయమై వ్రాయఁబడినపైపద్యమును భట్టుమూర్తికి నన్వయించుటకంటె మఱియొకచిత్రము కన్పట్టదు."అని విశేషోక్తిపరంపరలచే వ్రాసిరి. ఇంతశ్రమ అక్కఱలేకయే వీ రీపద్యమున కెట్లు సమన్వయింపవచ్చు నని న న్నడుగుటయే కల్గిన దీని కపుడే సమాధానము పంపియుందును. అట్టియదృష్టమునకుఁ బ్రాత్రులము మే మిర్వురముం గాకుండుటఁ జేసి ఆసమాధానమును నేనును గ్రంథరూపముగాఁ జేయవలసివచ్చినది. అది యెట్లన్నను :- లోకములో నెట్టికవియైన నొకయంశముంగూర్చి యితరుల నెగతాళిచేయవలసివచ్చినప్పుడు అట్టిభావమును జూపించుటకుగాను తాఁ బ్రత్యేకము పద్యము కల్పించి చెప్పుటకంటె అంతక్రితమువ్యాపకములో నుండెడుసమయోచిత మగునితరకవికృతపద్యములంగానీ శ్లోకములం గానీ ప్రస్తావనముచేయుట సర్వత్ర విదితాంశమే. అట్టిపట్ల ఆప్రస్తావకుఁడు స్వయముగా శ్లోకము చెప్పుటకంటె నన్యుల ప్రస్తావనశ్లోకమునే ప్రకటించిన రసవంత మగును.

కాళిదాసకృతశ్లోకములును, పండితరాయకృత శ్లోకములును, నీతిసంగ్రహములోని శ్లోకములును, వేమనపద్యములు సహితము ప్రస్తావనకు మున్మున్నుగ వచ్చుచుండుట అనుభవసిద్ధమే. అట్టిచోఁ రామలింగము భట్టుమూర్తివీఁపున తామరయున్నదని రాజునకుం దెల్పి యపహసించుటకు లో నూహించుకొని, ఆవఱలోవ్యాప్తమైయున్నపద్యముం జదివి దానిని సమన్వయించిన నన్వయించి యుండవచ్చును. లేకున్న ఆపద్యము తాఁ జేసినదే యని బాలుడై యున్న భట్టుమూర్తిని మోసపుచ్చి యైన నుండవచ్చును. అది తిరుగ రాజసన్నిధిం జదువు మనినపు డందులోనిచమత్కారభాగము చదివినట్లు పద్యమున్నది. ఇక్కడ కాక మానురాయ అని విడఁదీసినచోఁ గల్గెడువిశేషము బట్టుమూర్తికంచుక మూడఁదీసిన యెడలఁ గాన్పించు నని పరిహసించినం జాలియుండును. ఇట్లు వ్రాసియున్నంత మాత్రమున నీకథ కట్టుకథ కాకపోలేదు. ఈలాటికథలను నమ్మియే సిద్ధాంతము లే