పుట:Kavijeevithamulu.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366

కవి జీవితములు

ఇంతదనుక మనము ప్రత్యేకము క్రొత్తమార్గమున భట్టుమూర్తిరాజు, రామరాజభూషణకవి వేఱని చూపుటకుఁ జర్చించుచుంటిమి గాని యీమనయుపన్యాసమునకుఁ బ్రధానకారణ మగు పూండ్ల, రామకృష్ణయ్య పండితుఁడు కందుకూరి వీరేశలింగము పండితుఁడును చేయు సంవాదములోని యాథార్థ్య మారసి చెప్పం బ్రాలుమాలినాము. అయినను అ ట్లూహించంబనిలేదు. పైయుపన్యాసములో నేదియో యొక పక్షము స్పష్టమే అగుచున్నది కావున నిఁక మనయభిప్రాయము చెప్పుటలో శ్రమ యుండనేరదు. పైయుపన్యాసము వినినతోడనే పై యిర్వురురియుక్తులలో నేది ప్రశస్తమో యేది కాదో అది కరతలామలక మై కాన్పించు. ఇది మొదటిపేరాకు విమర్శనము.

(2) అందులో రామరాజభూషణుఁ డనుకవి వసుచరిత్రము నరసభూపాలీయము, హరిశ్చంద్రనలోపాఖ్యానమును వరుసగా రచియించినాఁ డని క. వీ. గారు చెప్పినమాట నిలిచినది కాదు. భట్టుమూర్తికి రామరాజుయొక్క ఆస్థానమం దుండుటచేత వచ్చినబిరుదాంక మిది కాదని రా. కృ. గారు చెప్పినయుక్తులు సహేతుకములు. అందు రా. కృ. గారు చెప్పినబంధకవిత్వ దృష్టాంతము మట్టుకు రామభూషణుఁడు చతుర్విధ కవితానిర్వాహకుఁడని నని చెప్పుకొని యుండుటం బట్టియు నట్టిప్రజ్ఞ తన కున్నట్లు చెప్పుకొనిననరసభూపాలీయకవి దానిం జెప్పుటం బట్టియుంజూడ నీస్థలములో రా. కృ. గా రుద్దేశించినయుక్తి నిద్ధారణకుఁ జాలి యుండ దని చెప్పవలసి యున్నది. క. వీ. గారు జనశ్రుతినిఁ బాటించి గ్రంథస్థగాథలఁ బరిహరించుటలో న్యాయము లేదు.

(3) I. పురాణనామచంద్రికలోను, II. దక్షిణహిందూస్థానకవులచారిత్రములోను, III. బ్రౌణ్యనిఘంటువు నందును, VI. సుజనరంజనిపత్రికయందును, V. ముద్రిత మైనవసుచరిత్ర ముఖపత్త్రము నందును. VI. పాండురంగవిజయములోని దని పుట్టినచాటువునందును, VII. శ్రీరాథాకృష్ణసంవాదమునందును, వ్రాయంబడిన సిద్ధాంతములు గతానుగతికములు కాని పరిశీలనా జన్యములు కావు. కావున నందలి.