పుట:Kavijeevithamulu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

359

క్షావాలం బగునాపరిగ్రహయుగం బన్యోన్యహార్దంబునన్
సేవింపం దగు రామచంద్రుఁడు శుభశ్రీ లిచ్చు మా కెప్పుడున్.

అని గ్రంథారంభమందు వసుచరిత్రములో వలెనే శ్రీరామునిఁ గవి వినుతించె. అంతటితోఁ దనివి నందక శ్రీరామసహచరు లగు సీతామహాదేవిని, భరతుని, లక్ష్మణుని, శత్రుఘ్నుని, హనుమంతుని, నుతియించి యిట్టివారికథను కావ్యము చేసినవాల్మీకింగూడ ప్రత్యేక ప్రత్యేకపద్యములతో నుతియించె. ఇట్లు కృతికార్యములోఁ దనకవిత్వేష్టదేవత యగునాంజనేయుని యాజ్ఞయు నైనదనియును, ఆంజనేయుఁడుగూడ నీతనికిఁ గలరామభక్తికి సంతసించి తనకుం బ్రభుం డగురామునకుఁ గృతి యి మ్మని యుత్సహించుటంజేసి యట్లొసంగితి నని చెప్పెను. వసుచరిత్రకవి విశేషముగా రామభక్తుం డై నందునఁ దత్ప్రీతికొఱకాతనిచేఁ జేయంబడినకార్యములు తనకుఁగా దాఁ జెప్పుకొనిన నాత్మ స్తుతిదోషము కల్గు నని తోఁచి కానోవు నాంజనేయవాక్యములుగా నీక్రిందివిధమున వర్ణించె.

సీ. సుతులఁ బెక్కండ్ర శాశ్వతరామనామధ,న్యులఁ జేసిపిలుచుభాగ్యోదయంబు
    రచితాగ్రహారంబు రామచంద్ర పురాంక, పూతం బొనర్చిన పుణ్య రేఖ
    నవదివ్యభవనంబు సవిరించి శ్రీరామ, విభుఁ బ్రతిష్టించినవిపులమహిమ
    రామసరో నామ రమణీయముగఁ దటా,కము వినిర్మించినఘనయశంబు

తే. సఫలత వహించు నీహరిశ్చంద్రనలక, థాయుగనిబంధచిత్రబంధ ప్రబంధ
    మంకిత మొనర్చు రఘుభర్త కఖిలకర్త, కురుతరాభీప్సితము లెల్ల నొదవు నీకు.

దీనింబట్టి చూడఁగా నీవసుచరిత్ర, హరిశ్చంద్ర నళోపాఖ్యానముల రచియించినకవి తనకుఁ గల రామభక్తిం దెల్పుటకుంగాను, (1) తనకుమారులలో ననేకులకు రామనామ ముంచెననియును (2) ఒక గ్రామము గట్టించి దానికి రామచంద్రపుర మనునామ ముంచె ననియును, (3) సుందర మైనదేవతాభవనము (దేవాలయము) కట్టించి దానిలో శ్రీరామవిగ్రహప్రతిష్ఠ చేయించెననియును, (4) చెరువు త్రవ్వించి దానికి రామసరోవర మనునామం బుంచెననియు (5) ఇపు డీహ