పుట:Kavijeevithamulu.pdf/363

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
357
రామరాజభూషణకవి.

అందు

1. మొదటిది శ్రీరామచంద్రచరణార వింద వందనము, ఇది కొందఱివలన కవియొక్కవిశేషణముగా నూహింపఁబడక ఆవాక్యము వెంబడినే వచ్చు "పవననందన" శబ్దముతో నన్వయింపఁబడుచున్నది. అట్లు సరి కా దనిచెప్పుట కనేకనిదర్శనము లున్నవి. వాని నీగద్యలోని విశేషములు చెప్పినతోడనే వివరింపఁదలంచి ప్రస్తుతము గద్యములోని విశేషముల నుడివెదము. అంతవఱకును ఆరెండువిశేషణములు వేఱుగాఁ గ్రహింప వేడుచున్నాము. అట్టిచో మొదటివిశేషణాభిప్రాయముంబట్టి పై రెండుగ్రంథముల రచియించినకవిమాత్రము పరమార్థవిషయమై కానోవు రామోపాసనము విశేషించి చేసె నని తేలుచున్నది.

2. రెండవ విశేషణమువలనఁ బవననందనప్రసాద సమాదిత సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్యకవి యని తేటపడు. ఉపాసకులలోఁ గొందఱు ఆముష్మికమున కొకదేవతోపాసనయును, ఐహికమున కొకదేవతోపాసనయుఁ జేయుట కలదు. అటులనే వసుచరిత్రకవి ఆముష్మికమునకు రామోపాసనయు, నైహికమున కాంజనేయోపాసనయుం జేసినట్లును స్పష్ట మగుచున్నది. ఇట్టి యైహికఫలముకొఱకుఁగాఁ జేసిన యుపాసనవలనఁ దనకు సంస్కృతాంధ్రభాషలలో గొప్పకవిత్వ ప్రజ్ఞ కల్గెనని చెప్పెను.

3. చతుర్విధ కవితా నిర్వాహక అను విశేషణము మూఁడవది చతుర్విధకవిత్వ మనఁగా గద్యకవిత్వము. పద్యకవిత్వము, పదకవిత్వము, బంధకవిత్వము అనునవి. అట్టిచతుర్విధకవిత్వప్రజ్ఞ కలవాడు.

4. "సాహిత్యరసపోషణుఁడు" అను బిరుదు వసుచరిత్రకవి కొక్కనికే ఆంధ్రభాషలోనికవులందఱలో మిక్కిలి తగియుండు నని చెప్పవలసియున్నది. ఇది నరసభూపాలీయకవి కున్న ట్లాగ్రంథ మొక సంస్కృతగ్రంథమున కాంధ్రీకరణ మవుటంజేసియు దానిం దెల్పు మఱియొకగ్రంథ మతనిపేరిట లేకుండుటం జేసియు, నతనిగద్యములోఁగాని