పుట:Kavijeevithamulu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

కవి జీవితములు

సమర్థత కల దని వక్కాణించును. తానావఱకొకప్రబంధమును రచియింపకున్నను, ప్రస్తుతములో నైన నట్టిరచనకు ననుకూలసమయము తటస్థించక పోవుటయును లో నూహించి అది దేశములో ప్రబంధరచనాకాల మవుటంజేసి అట్టిప్రజ్ఞ తనయెడ నున్నట్లగుపఱుచుకొనుట ప్రబంధకర్తల కవసర ముండదు. అది లేనినాఁడే దాని నేరైన విశదీకరించుట కవసరము కలుగును. వసుచరిత్ర నరసభూపాలీయకవులు వేఱుగ నుండవచ్చు నని సూచించు కారణములలో నిది యొకటి.

(5) ఇఁక నైదవబిరుదులోఁ దాను సకలభాషలలో నిరుపమాన మగు నవధానతంత్రము చేయఁగలవాఁడ నని సూచించె. ఇది యొక గొప్ప ప్రజ్ఞ. కవిత్వప్రజ్ఞ గలయందఱికిని అష్టావధానతంత్రప్రజ్ఞ యుండదు. అష్టావధానికిమాత్రము కవిత్వప్రజ్ఞ యుండక తీఱదు. అది లేనిచో నవధానప్రజ్ఞ నిరుపయోగ మగును. నరసభూపాలీయకవి కారెండుప్రజ్ఞలు కలవు.

రామభూషణునియొక్క పద్యములోను గద్యములో నుండునవియే రామభూషణకవి కవితావిశేషము లని చెప్పవలసియున్నది. కావున వానిని వేఱ్వేరుగ నీక్రిందఁ బరిశీలింతము.

1. ఏకైక దినప్రబంధఘటన = ఒక్కొక్కదినమున నొక్కప్రబంధము సంఘటింపఁ జేయుశక్తి.

2. సద్యశ్శతగ్రంథకల్పన = అప్పటి కప్పుడు నూఱనుష్టుప్పులు చెప్పునట్టిశక్తి.

3. సంగీతకళారహస్య వేదిత్వము = సంగీత శాస్త్రరహస్యములు తెలియు నని గాని సంగీతశాస్త్ర, చతు షష్టి కాశాశాస్త్ర రహస్యములు దెలియునని గాని చెప్పవచ్చును.

ఇట్లు కానుపించు పై కవిత్వప్రజ్ఞలు నిష్పక్షపాతబుద్ధితోఁ బరిశీలించినచో నాప్రజ్ఞలు గలవా రొకరైనదియు నిర్వురైనదియు స్పష్టము కాక మానదు.

వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానములు రచియించినకవికిఁ గలప్రజ్ఞలును, ఉపాసనావిశేషంబు లెట్లు చెప్పంబడినవో చూతము.