పుట:Kavijeevithamulu.pdf/361

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
355
రామరాజభూషణకవి.

5. అచలజిహ్వోక్తినైపుణ్యము = నాలుక కదల్చక కవనము చెప్పుట.

6. తత్సమభాషావితానజ్ఞత = తత్సమ, తద్భవ, దేశ్యాదిభాగములు గలయాంధ్ర భాషలోఁ గేవలము తత్సమభాషనే కవిత్వము చెప్ప నేర్చుట.

7. బహుపద్యసాధితవ్యస్తాక్షరీధురీణత = వ్యస్తాక్షరి చేయు నేర్పు పండిత సాధరణప్రజ్ఞ; అందులో ననేక పద్యములలో నొక్కసారి వ్యస్తాక్షరిం జేయుట యసాధారణప్రజ్ఞ, ఇట్టిపనిం జేయుట.

8. ఏక సంధోచితశ్లోకభాషాకృత్యచతురత = ఒక్క సంద కల్గునట్లుగా శ్లోకమంతయుం జెప్పుట.

9. ఓష్ఠ్యనిరోష్ఠ్య సంకరజ్ఞత = ఓష్ఠములు తగులునటులను, తగులనటులను కలిపి కవిత్వము చెప్పు నేర్పు.

10. అచలయనుకాశుధీ = చలించినట్టియు యమకయుక్తమగునట్టి అశుధారాకవిత్వము చెప్పెడుబుద్ధి.

గద్యము.

1. హనుమత్ప్రసాదలబ్ధకవితాసారుఁడ నని.
2. సారస్వతాలంకారుఁ డనని.
3. నిరంకుశప్రతిభాబంధురుఁడ నని.
4. ప్రపబంధపఠనరచనాధురంధరు డ నని.
5. సకలభాషావిశేషనిరుపమానధానశారదామూర్తి నని.

ఇ ట్లుండవానికిఁ గారణము లూహించవలసియుండును. అందు

(1) మొదటివిశేషణముం బట్టి యితఁ డాంజనేయోపాసకుఁ డనియు తనయుపాసనాదేవుని కటాక్షముచేత సంప్రాప్త మైనకవిత్వశక్తి కలదనియుఁ దెలియుచున్నది.

(2) రెండవవిశేషణములోఁ దాను సారస్వతాలంకారుఁ డని చెప్పుటచే విద్యాలంకారము గలవాఁ డని తేలినది.

(3) మూడఁవవిశేషణములో నిరంకుశప్రతిభాబంధురుఁడ ననుటంజేసి కవిత్వమునకుఁ బ్రధానసాధన మగునట్టిప్రతిభ కలవాఁడనియు, నదియు నిరంకుశమైన దనియుం దేలినది.

(4) నాల్గవవిశేషణములో "ప్రబంధపఠనరచనా ధురంధరుఁ డనుటంజేసి" తనకు ప్రబంధపఠనమందును, ప్రబంధరచనయందుంగూడ