పుట:Kavijeevithamulu.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

353

ఇట్లు వ్రాయంబడి ఆంధ్రకవులచరిత్రములోఁ బైయుభయపక్షములవారును జెప్పెడుయుక్తులను చక్కఁగా గ్రహింపఁ గలుగుటకై వంశక్రమమును తెల్పెడురెండుపద్యము లుదాహరింపఁబడినవి. అయితే క. వీ. గారి కావఱకు పైకవు లిర్వురు వేఱువేఱని కల్గినయభిప్రాయము రెండవ వృత్తాంతము వినినతోడనే మాఱినట్లును దాని నొకసిద్ధాంతము చేయుటకు తోఁచక చదువరు లట్టిసిద్ధాంతము చేసికొనుటకు పైకవు లిర్వురు నొక్కనిగానే భావించి ఆపక్షములో నితరులు చెప్పుయుక్తులు తామే చెప్పి వారిపక్షమును తామే అవలంబించి వ్రాసిన ట్లున్నది. రెండుపక్షములును వినినచదువరులు సిద్ధాంతముఁ జెప్పవలసినవారు కావున నే నిపుడట్టి సిద్ధాంతమును స్పష్టీకరించెదను. వారిసిద్ధాంతమునకు ప్రధానమైనయొకవిశేషముగూడ వివరింపఁబడినది. అది యెద్దియనఁగా, ఇరువురును భిన్ను లైనను కాకపోయినను చరిత్రభాగమునందు వేఱు వేఱుగ వ్రాయవలసినయంశము లేవియుఁ గానఁబడవు అను దీనితో నే నేకీభవింపను. ఇరువురు భిన్ను లైనపుడు వ్రాయవలసిన చరిత్రభాగమున్న దనియే నాయభిప్రాయము. కావున నీ సంప్రశ్నము సంపూర్ణముగా విచారించవలసిన దని చె ప్పెదను. దానికిగా నుదాహరింపఁబడిన పద్యము లెవ్వి యనగా :-

నరసభూపాలీయము.

సీ. శతలేఖినీపద్యసంధానధౌరేయు, ఘటికాశతగ్రంథకరణధుర్యు
     నాశుప్రబంధబంధాభిజ్ఞు నోష్ఠ్య ని,రోష్ఠ్యజ్ఞు నచలజిహ్వోక్తినిపుణుఁ
     దత్సమభాషావితానజ్ఞు బహుపద్య, సాధితవ్యస్తాక్షరీధురీణు
     నేకసంధోచితశ్లోకభాషాకృత్య, చతురు నోష్ఠ్యనిరోష్ఠ్యసంకరజ్ఞు
     నచలయమకాశుధీప్రంబంధాంక సింగ, రాజసుతతిమ్మరాజపుత్త్రప్రసిద్ధ
     సరసవేంకటరాయభూషణసుపుత్త్రు, నను బుద్ధవిధేయు శుభమూర్తినామధేయు.

హరిశ్చంద్రనలోపాఖ్యానము.

సీ. వనధిలంఘనకృపావార్ధితోభయకవి, తాకళారత్న రత్నాకరుండ
    సకలకర్ణాటరక్షాధురంధరరామ, విభుదత్తశుభచిహ్న విభవయుతుఁడ
    వసుచరిత్రాదికావ్యప్రీతబహునృప, ప్రాపితానేకరత్నప్లవుండ
    శాశ్వతశ్రీవేంకటేశ్వరానుగ్రహ, నిరుపాధికైశ్వర్యనిత్యయశుఁడ