పుట:Kavijeevithamulu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346

కవి జీవితములు

ప్రద్యుమ్నము సూరకవి తనముదుసలికాలములో రచియించినప్రబంధ మౌటం జేసియును, తనతండ్రిపేరిటఁ గృతియిచ్చి తాను తీర్థయాత్రాదికము తనతమ్మునివలెఁ జేయలేకపోయిన లోపముఁ దీర్చికొనుటకై యత్నించుటంజేసియును అందు గ్రంథపూర్తికొఱకే యత్నించియుండునుగాని కేవలము ప్రజ్ఞాప్రకటనకే యత్నించియుండఁడు. ఆకారణముచే నందు కఠినవచనములు గాని గొప్పవర్ణనలు గాని తఱుచుగాఁ గానుపించవు. ఇట్టిగ్రంథమును ఆధారము చేసికొని ఉపన్యాసకుఁడు సూరన నప్పటి కాలమువారికంటె నధికుఁ డని ప్రస్తుతవచనకావ్యకర్తలలోఁ గొందఱిఫక్కి ననుసరించి చెప్పుట అసంగతము. ఎవ్వఁడును సమానులలో నుత్తముఁడు గాఁ బ్రయత్నించుంగాని తత్వ్యతిరిక్తము కాదు గావున సూరనయు న ట్లొనరించినవాఁ డనియే సీద్ధాంతీకరించెదము.

కళాపూర్ణోదయకల్పనావిషయము.

ఇదివఱకే సూరకవికృతము లగుగ్రంథములు కళాపూర్ణోదయము తరువాయిగ నన్నింటిం దెల్పినాఁడను. ఇఁక నీవిషయమునఁ గొంచెముగా వ్రాసి సూరకవిచరిత్రము వ్రాయ విరమించెదను. పాఠకులు నావలన నింతవఱకు నీయఁబడిన విమర్శశ్రమకు సహించి కొంచె మవకాశముతో నీగ్రంథవిషయమునఁగూడ నే నిచ్చుశ్రమకు మన్నించెదరుగాక.

ఈపైగ్రంథములోఁ గవిత్వశయ్యాదులయందుఁదప్ప కల్పనావిషయమై సూరకవిని నేను శ్లాఘించను. ఆ 1882 వ సంవత్సరములోనో ఆసమీపకాలములోనో యిది మొదట ముద్రిత మైనపుడు దీనిని మామిత్త్రు లొకరు నామొద లగుస్నేహితులు కొందఱికి మాయభిప్రాయప్రకటనకుగా నిచ్చియుండిరి. అపు డట్టిమాయభిప్రాయమిచ్చుటకును గథాసందర్భము బోధపఱుచుకొనుటకును దీనికి సంగ్రహము వచనముతో నావలన వ్రాయంబడినది. దాని నిందుఁ బ్రకటింప గ్రంథవిస్తరభయంబున మానుచున్నాఁడను. అయ్యది ప్రత్యేకవచనకావ్య