పుట:Kavijeevithamulu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

345

12 ఉ. ఇతఁడు వచనములుగూడ మిగుల సులభముగా వ్రాయును. మనుచరిత్రవసుచరిత్రాదులందుఁ బద్యములకంటె వచనములు మిగులఁ గఠినశైలిని వ్రాయఁబడియున్నవి. అందులకర్తృకర్మక్రియలను గ్రహించి వాక్యాన్వయము చేసుకొను నప్పటికే దుర్లభము. ఈయలవాటు సూరన తనకళాపూర్ణోదయమునఁ బీఠికయందు నిల్పినాఁడు కాని తర్వాత వ్రాసినవచనములనెల్ల మిగుల సులభము గాను, సరసముగాను వ్రాసియున్నాఁడు. ఈతనివచనములు భారతము నందలివచనములతోడఁ బోల్పఁదగియున్నవి. పద్యములు కఠినశైలిని వ్రాయఁబడియుండినను, వచనములు నడుమ నుంచినఁ గ్రందసందర్భము బాగుగాఁ దెలిసికొనవచ్చుననియు, గ్రంథ మంతయుఁ బద్యమయమై యుండక అక్కడక్కడ వచనములుకూడ నుండినచోఁ జదువరుల మనస్సునకు విశ్రాంతి నొసఁగు ననియు వచనములు పద్యకావ్యముల యందుఁ జేర్పఁబడుచున్నవి. అది పోవం బోవ పద్యములకంటె వచనములు మిగుల గఠినశైలిని వ్రాయుటలోనికి దిగినది..

చా. ఉపన్యాసకుఁడు చెప్పినట్లు వచనములు సులభముగ వ్రాయుట యిప్పటికాలపుచదువరులలో శ్లాఘనీయకార్య మైన నగునుగాని సూరనకాలములో నది యట్లుకాదు. వర్ణనావిషయమై కలనిరంకుశప్రజ్ఞ జూపుటకుఁ గలకోర్కెను చందోబద్ధము లైన పద్యములలో. జూపుటకు వలనుపడక ప్రబంధకవులు విశేషకథాసందర్భ మవసరము లేనిచోట నాశ్వాసమున కొక్కటియో రెండో వచనము లుండుచుండు నాచార మేర్పర్చికొనిరి. కొందఱు కవులు వచనములు పెక్కులు చెప్పుట వివిధవృత్తములయెడ నాదరణము గలచదువరులకు నానందకారులు కాకపోవు నని యెంచి అనేకచరణయుక్తములుగాఁ జేయం దగు రగడలు, దండకములు మొదలగువానిని విశేషించి వ్రాసి వచనముల గొన్నిఁటిం దగ్గించిరి. కావున వచనములు మొదలగునవి పద్యముల కంటె స్వభావముగఁ గఠినశైలిలో నుండుట కాన్పించు. సూరనకవియు నావఱకు తనచే విరచితము లైనప్రథమద్వితీయకావ్యములు ప్రబంధములు కాకుండుటంబట్టి అందు కొన్నిలోపము లున్నట్లు గ్రహించి తనమూఁడవగ్రంథమును బ్రబంథముగా రచియించి యందుఁ తనతొల్లింటిగ్రంథములలో నుండులోపములఁ బెక్కులు నివారించెను. ఇట్లు ప్రభావతీప్రద్యుమ్నములో నేల లేవనఁ గారణము చెప్పెదను. ప్రభావతీ