పుట:Kavijeevithamulu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

319

షముగా ముసలివాఁ డైనతఱి కృష్ణమరా జతనికడ నుపదేశమంది శిష్యుఁ డై యుండి తనముసలికాలములో బాల్యవయస్సున నుండు పింగళిసూరకవి శ్రీనివాసాచారి కాలీనుఁడు కాకున్న నేకశతాబ్దములోనివాఁడు మాత్రము కాక తప్పదు. కృష్ణరాయల గురు వని ప్రసిద్ధిం జెందినట్టియుఁ గృష్ణరాయానంతరము రాజ్యమునకు వచ్చినరామరాయని కాలములో దేవస్థానప్రతిష్ఠాదిక మొనరించినట్టి తాతాచార్యునికాలము క్రీ. శ. 1509 - 77 = 1432 శా. స. మొదలు అనఁగా గృష్ణరాయరాజ్యారంభకాలములో మొద లయి యుండును. కాఁబట్టి తాతాచారితండ్రి యగుశ్రీనివాసాచారియును, అతనిశిష్యుఁ డగునంద్యాల కృష్ణమరాజును. అతనిపైని కృతి రచియించిన పింగళిసూరనయును సమకాలీను లని గాని లేక యొకశతాబ్దములోని వారే యని గాని నిశ్చయించిన సూరకవి తాతాచార్యకాలీనుఁ డై తద్వారముగఁ గృష్ణదేవరాయల కాలీనుఁ డై రామరాయలపైఁ గృతి నిచ్చిన హరిశ్చంద్రనలోపాఖ్యానగ్రంథకర్త యగు రామరాజభూషణకవికిఁ బూర్వుఁ డై యుండుట కెంతమాత్రము సందేహింపఁ బడనివాఁ డై యుండును గదా. కృష్ణమరాజుపైఁ గృతి యీఁబడినకళాపూర్ణోదయ గ్రంథముకంటెఁ బూర్వము రచియింపఁబడినరాఘవ పాండవీయద్వ్యర్థికావ్యము హరిశ్చంద్రనలోపాఖ్యానమునకంటెఁ బ్రాచీన మైనది యగుటయు నిస్సంశయాంశమే కదా. కాఁబట్టి పైసంవాదద్వితయమును బరిశీలించిన వారు పింగళిసూరనకవి పది యాఱవశతాబ్దములోనివాఁ డని నిర్ణ యింపక అతఁడు కృష్ణదేవరాయనివలె పదునేనవశతాబ్దములోనివాఁ డని సిద్ధాంతీకరించుటయే కాక అతఁడు కృష్ణరాయనిసంస్థానాష్టదిగ్గజములలోని వాఁడు కావచ్చు నని నిశ్చయించి చెప్పుట దోషయుక్త మేమో శ్రద్ధతో నాలోచించి తీర్మానించుటకుఁ బ్రార్థింపఁబడుచున్నారు.

పింగళి సూరకవి రచియించినగ్రంథప్రశంస.

ఇంతవఱకును మనము సూరకవియొక్కకాలనిర్ణయము చేయుటలోఁ గాలక్షేపము చేసి తత్కవికృతము లగుగ్రంథ విశేషముల వివ