పుట:Kavijeevithamulu.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

కవి జీవితములు

బూర్వము ద్రావిడ ప్రాణాయామముగాఁ దిరుమలతాతాచార్యుల వంశ చారిత్రమును తత్తత్కాలీను లగురాయలకాలమును వివరింపఁబడవలయును. గ్రంథవిస్తర భయ మున్నను దేశచారిత్రముగావున మఱియొకచో వ్రాయవలసినగాథ లిచ్చోటనే వ్రాయ గమ కించినాఁడను.

తిరుమల తాతాచార్యుల వంశగాథ.

నృసింహాచార్యులు (ఏటూరినగరనివాసి. ఇతఁడు విజయనగరప్రభు వగు విరూపాక్షరాజునకు గురువు)
         |
తాతాచార్యులు.
         |
 శ్రీశైపూర్ణులు.
         |
శ్రీనివాసాచార్యులు.
         |
తాతాచార్యులు.
         |
వేంకటాచార్యులు.
         |
సుదర్శనా (సుందరా) చార్యులు.
         |
శ్రీనివాసాచార్యులు. (నంద్యాల కృష్ణమరాజుగురువు)
         |
తాతాచార్యులు. బహుప్రసిద్ధుఁడు కృష్ణదేవరాయ రామదేవరాయల గురువు.
         |
లక్ష్మీకుమారతాతాచార్యులు. అప్పయదీక్షితకాలీనుఁడు
         |
వేంకటాచార్యులు.

పైవంశవృక్షము ప్రసన్నా మృత మనునొకప్రసిద్ధ రామానుజచారిత్ర గ్రంథమునుండి యెత్తి వ్రాయఁబడినది. తద్గ్రంథకర్త యగు ననంతాచార్యులు వేంకటవరదాచార్యుల శిష్యుం డగుటం జేసి అతఁడు వ్రాయుచున్న స్వగురువంశావళి యైన లెస్సగాఁ బరిశోధించక యుండఁ డని యూహింపఁదగి యున్నది.